సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నప్పటికీ.నిజజీవితంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోనుసూద్ ఆదాయపన్ను ఎగ్గొట్టాడంటూ కేంద్ర ప్రచారం చేస్తుంది.
దీన్ని సాధారణ జనం జీర్ణించుకోలేకపోతున్నారు.ఆలయాల్లో విరాళాలు ఇచ్చిన.
హుండీలో కానుకలు వేసిన.రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసిన ఎటువంటి ఆదాయపన్ను వర్తించదు.
వీటన్నింటికీ ఆదాయ పన్ను నుంచి రాయితీ లభిస్తాయి కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిడ్ సమయంలో తమ సొంత సంపాదను వెచ్చించి ప్రజలకు, రోగులకు పెద్దఎత్తున సాయమందించిన సోనూసూద్ సంపదను లెక్కే చేసిన సాయానికి సుగుణంగా ఆదాయపు పన్ను చెల్లించలేదంటూ ప్రభుత్వం విరుచుకుపడడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది.ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా సోనూసూద్ అభిమానులు, సామాజిక నిపుణులు, కార్యకర్తలు ఏకమవుతున్నారు.
పేదల కోసం తన సొంత సంపాదన వెచ్చించిన సోనూసూద్ పై ప్రభుత్వం కక్ష గట్టి ఇలాంటి ఆరోపణలకు దిగడాన్ని తప్పుబడుతున్నారు.వీటిని కడించడమే కాదు తమ శ్రేయస్సుకోసం సోనుసూద్ ఖర్చు చేసిన మొత్తంపై కేంద్రానికి చెల్లించాల్సిన ఆదాయపన్ను తామే కట్టేందుకు ముందుకు వస్తున్నారు.
ఇందుకోసం కేంద్ర ఆదాయపన్ను శాఖ లేదా సోనూసూద్ ప్రత్యేకంగా ఒక ఖాతాను తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా రూపాయి నుంచి లక్ష వరకు ఈ ఖాతాలో జమ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

అలా తమ కోసం సోనూసూద్ ఖర్చు చేసిన మొత్తం పై కేంద్రానికి చెల్లించాల్సిన ఆదాయ పన్నును తామే చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.ఇది సోనూసూద్ పట్ల దేశ ప్రజల్లో ఏర్పడ్డ అభిమానానికి తార్కాణంగా నిలుస్తుంది.అదే సమయంలో సేవాతత్పరత కలిగిన వ్యక్తుల పై ప్రభుత్వలు కక్ష పూరిత ధోరణి పట్ల ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు ప్రతిబింబిస్తుంది.సోనూసూద్ ఈ మొత్తాన్ని తన కోసం ఖర్చు చేసుకోలేదు.
తన విలాసాలు, ఆడంబరాల కోసం, ఖర్చు పెట్టలేదు.విశాలమైన భవంతి నిర్మాణానికి చేయలేదు.

అందుకు భిన్నంగా కోవిడ్ సమయంలో పేద, బడుగు బలహీన వర్గాలు ఈ ప్రయాణ, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఖర్చు చేశారు.ప్రభుత్వాన్ని మించి ప్రజల పట్ల బాధ్యత చూపెట్టారు.ఓ దశలో ప్రభుత్వాలను అభ్యర్థించడం మానేసి పేదవారు, బాధితులు సోనూసూద్ వైపు దృష్టి సారించారు.తమ సమస్యల్ని ఆయనకు విన్నవించుకున్నారు.తమ సమస్యల్ని పరిష్కారించాల్సందిగా అభ్యర్థించారు.చిన్న ట్వీట్ చేసిన వాట్సాప్ లో మెసేజ్ పంపిన సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం అందించిన వెంటనే సోనూసూద్ స్పందించే వారు.