తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్( KCR ) ఓటమి రాజకీయ పరిశీలకులతో పాటు సాధారణ ప్రజానీకం లో కూడా మెజారిటీ ప్రజానీకాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.ముఖ్యంగా ప్రభుత్వ పరిపాలనపై పెద్దగా వ్యతిరేకత లేని పరిస్థితుల్లో కేసీఆర్ ఓటమి చాలామందికి మింగుడు పడటం లేదనే తెలుస్తుంది.
ఓటమి తర్వాత కేసీఆర్ ప్రవర్తన కూడా అంత హుందాగా లేదని ,గవర్నర్ కి రాజీనామాను స్వయంగా అందించకపోవడం కనీసం 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పకపోవడం, కనీసం గెలిచిన కాంగ్రెస్( Congress ) ను అభినందిస్తూ చిన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయకపోవడం వంటి విషయాలు కేసీఆర్ అహంభావ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయంటూ రాజకీయవాదులు మండిపడుతున్నారు .
![Telugu Assembly, Congress, Telangana-Telugu Political News Telugu Assembly, Congress, Telangana-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/12/brs-bjp-kcr-congress-Assembly-elections.jpg)
అయితే బారాస ఏమీ భారీ తేడాతో ఓడిపోలేదని ,రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం రెండు శాతం మాత్రమేనని, గట్టిగా ప్రయత్నిస్తే మరో నాలుగు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలతో తిరిగి బౌన్స్ బాక్ అయ్యే సత్తా కేసీఆర్కు ఉందని ఆయన అభిమానులు విశ్లేషణ చేస్తున్నారు.దాదాపు పది సంవత్సరాలు తెలంగాణను ఏక చత్రాదిపత్యం తో ఏలిన కేసీఆర్ కు సాదారణ ప్రజలతో పాటు మేదావి మరియు పారిశ్రామిక వర్గాలలో విపరీతమైన ఆదరణ ఉందని, వీటన్నిటిని మరోసారి క్రోడీకరించుకొని తప్పులు సరిచేసుకొని గట్టిగా ప్రయత్నిస్తే పార్లమెంట్ ఎన్నికలతో తిరిగి పుంజుకోవడం అంత కష్టం కాదని కూడా వీరు విశ్లేషిస్తున్నారు.
![Telugu Assembly, Congress, Telangana-Telugu Political News Telugu Assembly, Congress, Telangana-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/12/bjp-kcr-congress-Assembly-elections-Telangana-politics.jpg)
అయితే ఊహించని ఓటమితో ఒక్కసారిగా డీలా పడిన కేసీఆర్ కొంత కాలం మౌనముద్ర వహిస్తారని తెలుస్తుంది . ఎర్రబెల్లి నివాసంలో అత్యంత ఆప్తులును మాత్రమే ఇంతవరకూ కలిసిన కేసిఆర్ ( KCR )మీడియాతో మాత్రం ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అయితే ఓటమి తాలూకు బాధను జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఓటమి పాలయినా తెలంగాణలో సగభాగం పూర్తి స్తాయిలో మద్దతుగా నిలిచిన వైనాన్ని గుర్తు తెచ్చుకొని ప్రేరణగా తీసుకుంటే మాత్రం కెసిఆర్ తిరిగి నిలబడటం అంత కష్టం కాదన్నది ఆయన అభిమానుల మాట .