ఎస్ వై ఆర్ గార్డెన్ లో మహిళ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.

మహిళ బంధు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లేలాగుడా లోని ఎస్ వై ఆర్ గార్డెన్ లో జరిగిన మహిళ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.

మహిళ బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కటౌట్ కు పారిశుద్ధ్య, అంగన్ వాడి,ఆశ, వైద్య సిబ్బందితో కలిసి రాఖీలు కట్టారు.

పారిశుద్ధ్య కార్మికులకు,వైద్య సిబ్బందికి, ఆశ,అంగన్ వాడి కార్యకర్తల కు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ.

మహిళ లేని ప్రపంచమే లేదు,మానవ మనుగడనే లేదని అందరికి తెలిసిందే.ఎక్కడ చూసిన నేడు మహిళలు విశేషంగా రాణిస్తున్నారు.

వంటింట్లో ఉండే నేను రాజకీయాల్లో కి వస్తే ఇంద్రారెడ్డి గారి లాగా పనిచేయలేను అని,మహిళ గా సాధ్యం కాదు అన్న కొందరి మాటలు నాకు బాగా పనిచేయటానికి స్ఫూర్తి ఇచ్చాయి.సహనం, ఓర్పు,ప్రేమ,కరుణ,త్యాగం,కఠినం,ధైర్యం,క్షమా గుణం,అన్ని కలగల్సిన వారే మహిళ మణులు.

Advertisement

మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదని నేడు మహిళలు నిరూపిస్తున్నారు.రాజకీయాల్లో ఉన్న నాకు నా కొడుకుల సహకారం ఎంతో గొప్పది.

ప్రతి మహిళ విజయం వెనుక ఒక పురుషుడు కూడా ఉంటారు.తెలంగాణ రాకముందు ఆభరణాలు ధరించి రోడ్డు పైకి వెళ్లాలంటే భయంగా ఉండేది.

నేడు ఆ బాధ తప్పింది,పోకిరీల ఈవ్ టీజింగ్ తగ్గింది.షీ టీం లు కంటికి రెప్పలాగా మహిళలను కాపాడుతున్నాయి.

హైదరాబాద్ లో 90 మంది మహిళ ఎస్ ఐ లు విధుల్లో చేరారంటే పోలీస్ వ్యవస్థ లో ప్రభుత్వం కల్పించిన 33 శాతం రిజర్వేషన్లు మాత్రమే ప్రధాన కారణం.ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానం.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఇవి కూడా మహిళలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి.మంచినీటి కోసం మహిళలు నాన తిప్పలు పడే వారు.

Advertisement

నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతో తీరిన కష్టాలు.అసాధ్యాలను సుసాధ్యం చేసేది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే.గ్రామాల్లో నీటికి ఇబ్బందులు తప్పిన పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలనిలలో నీటి సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే 1200 కోట్ల రూపాయలు మంజూరు చేసారు.10 లక్షల మందికి కల్యాణ లక్ష్మి కింద 9 వేల కోట్లు అందించాం.ప్రభుత్వ చర్యల వల్ల అమ్మాయిల అక్షరాస్యత పెరిగింది.

నేడు యూనివర్సిటీ లలో 60 శాతం కు పైగా విద్యార్థినిలు చదువుతున్నారు.మహిళ సంఘాలు పెద్ద ఎత్తున రుణాలు పొందుతున్నాయి వడ్డీలేని రుణాలు 4 వేల కోట్ల రూపాయలు మహిళలకు అందించాం.గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా బలపడటానికి, చిరు వ్యాపారాలు చేసుకోవటానికి 3500 మందికి రుణాలు ఇవ్వటం జరిగింది.4 మహిళ పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా ఎదిగి నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ప్రభుత్వ లక్ష్యం.కరోనా సమయంలో బాగా పని చేసిన వైద్య,పారిశుధ్య,ఆశ కార్యకర్తల,మారి సంస్థ,ప్రతినిధుల సేవలు ఎంతో గొప్పవని మంత్రి కొనియాడారు.

తాజా వార్తలు