ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అనే విషయం అందరికీ తెలిసిందే.అయినప్పటికీ.
ఆమె పెళ్లయినట్లు చాలా మందికి తెలియదు.మరి అంజన్నకు వివాహం అయినా అతను బ్రహ్మచారి ఎలా అయ్యాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వాయు దేవుడి అనుగ్రహం వల్ల కేసరికి, అంజనా దేవికి పుట్టినవాడే ఆంజనేయ స్వామి.ఈయన చిన్నప్పుడు సూర్య దేవుడి వద్ద విద్యాభ్యాసం చేశాడు.
సూర్యుడు గగన తలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటు ఆకాశంలో ఎగురుతూ విద్య నేర్చుకున్నాడు.అలా సకల విద్యలు, వ్యాకారణాలు నేర్చుకొని మహా పండితుడు అయ్యాడు.
కానీ వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్య దేవుడు తన కూతురు సువర్చలను హనుమంతుడికి ఇచ్చి వివాహం చేశాడు.అయినప్పటికీ ఆంజనేయ స్వామి బ్రహ్మ చర్య దీక్షకు ఎటువంటి భంగం వాటిల్లకుండా వరం కూడా ఇచ్చాడట.
అలా సువర్చలా దేవి ఆంజనేయ స్వామి ఆత్మలో కలిసిపోయింది.ఇలా వాయు పుత్రుడు పెళ్లి అయినప్పటకీ.
బ్రహ్మచారిగా ఉండి చరిత్రకెక్కాడు.
అంతే కాదండోయ్ ఆంజనేయ స్వామి మహా శక్తిమంతుడు అయినప్పటికీ.
సహజ సిద్ధమైన కారణలతో కొంటె వాడిగా మారి తెగ అల్లరి చేసేవాడు.ఈయన అల్లరి తట్టుకోలేక మునులు హనుమంతుడు శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించారు.
ఎవరైనా గుర్తు చేస్తేనే ఆ విద్య గుర్తుకు వస్తుందని కూడా చెప్పారట.ఈ ఘటన తర్వాతే అంజన్నకు చదువు మీద ధ్యాస పుట్టింది.
సూర్య దేవుడికి గురు దక్షిణగా… సూర్యుడి కొడుకు సుగ్రీవవనకు మంత్రిగా ఉండేందుకు ఆంజనేయ స్వామి అంగీకరించాడు.