జ‌న‌వ‌రి 11న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం బ్రేక్ ద‌ర్శ‌నం ర‌ద్దు

తిరుమల శ్రీవారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 13న‌ వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 11న‌ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది.సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

 Tirumala Break Darshan Cancelled Due To Koil Alwar Tirumanjanam, Koil Alwar Tir-TeluguStop.com

ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హిస్తారు.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది.

బ్రేక్ ద‌ర్శ‌నం ర‌ద్దు :

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11వ తేదీ మంగ‌ళ‌వారం శ్రీవారి ఆలయంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింది.ఈ కార‌ణంగా జ‌న‌వ‌రి 10న సోమ‌వారం సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube