సాధారణంగా మనం కొన్ని ఆలయాలను దర్శించినప్పుడు ఆలయ ప్రాంగణంలో ఎన్నో రకాల జంతువులను చూస్తుంటాము.కాకులు, కుక్కలు, కోతుల మొదలైన జంతువులు ఉండి భక్తులను ఆందోళనకు గురి చేస్తుంటాయి.
అయితే కొన్ని ఆలయాలను సందర్శించినప్పుడు ఆ ఆలయంలో మనకు కాకులు కనిపించకపోవడం చాలా అరుదుగా చూస్తుంటాము.అందుకు గల కారణం ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉంటారు.
ఈ విధంగా కాకులు కనిపించని ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి.అలాంటి అరుదైన ఆలయాలలో కోటప్పకొండ ఒకటని చెప్పవచ్చు.
ఈ ఆలయంలో కాకుల కనిపించకపోవడానికి గల కారణం ఆనందవల్లి అనే గొల్లభామ కారణమని స్థలపురాణం చెబుతోంది.
స్థలపురాణం ప్రకారం పూర్వం ఈ కొండ పైకి ప్రతిరోజు ఆనందవల్లి అనే గొల్లభామ ఆ శివుడికి పూజ చేయడానికి వచ్చేది.
మహా శివ భక్తురాలైన ఈమె ఆ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించే వరకు ఎలాంటి ఆహార పదార్థాలను తినేది కాదు.ఈమె భక్తికి ముగ్ధుడైన పరమేశ్వరుడు కూడా ఈమె పూజ కోసం ఎదురు చూసేవాడు.
ప్రతి రోజు ఆనందవల్లి కొండ కింద నుంచి కుండలో నీరు తీసుకొని కొండపైకి వెళ్లి స్వామివారికి అభిషేకం చేసేది.ఎప్పటిలాగే నీరు తీసుకెళ్లి స్వామివారి ముందు పెట్టి మారేడు దళాల కోసం వెళ్ళింది.
ఆనందవల్లి మారేడు దళాలను కోసుకొని తీసుకువచ్చే సమయానికి ఒక కాకి నీటిని తాగడం కోసం ఆ నీటి కుండ పై వాలి నీటిని కింద పడేసింది.ఎంతో కష్టపడి శివయ్య కోసం తీసుకు వచ్చిన నీటిని ఆ కాకి వల్ల పడిపోవడంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనందవల్లి ఇప్పటినుంచి ఆలయ పరిసర ప్రాంతాలలో కాకులు కనిపించకూడదని శాపం పెట్టింది.ఆ పరమేశ్వరుడి మనసు గెలుచుకున్న మహా భక్తురాలు కావడంతో ఈమె శాపం ఫలించింది.అప్పటి నుంచి ఆలయ ప్రాంతంలో చూద్దాం అన్న ఒక్క కాకి కూడా కనిపించదని ఆ ప్రాంత ప్రజలు కథలుగా చెబుతున్నారు.
DEVOTIONAL