మంచి ఎత్తు పెరగాలంటే తీసుకోవలసిన ఆహారాలు

ఎత్తు పెరగాలంటే వ్యాయామం,పౌష్టికాహారం తీసుకోవాలి.కొన్ని రకాల మినరల్స్,ప్రోటీన్స్ సహజంగా ఎత్తు పెరగటానికి సహాయపడతాయి.

 Amazing Foods And Diet For Increasing Height-TeluguStop.com

సాధారణంగా మనిషి పుట్టిన తర్వాత మగవారిలో 18 సంవత్సరాల వరకు,ఆడవారిలో 16 సంవత్సరాల వరకు ఎముకల పెరుగుదల ఉంటుంది.కొంతవరకు ఎత్తులో తల్లితండ్రుల జీన్స్ కూడా ప్రభావం చూపుతుంది.అలాగే కొన్ని ఆహారాలను డైట్ లో భాగంగా చేసుకుంటే ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటాయి.

గుడ్లు

గుడ్లలో విటమిన్ డి మరియు క్యాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకల పెరుగుదల,బలంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది.అందువల్ల ప్రతి రోజు గుడ్డును తినటం అలవాటు చేసుకోవాలి.

ఆకుకూరలు

ఆకుకూరల్లో ఎముకల పెరుగుదలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉండుట వలన రోజువారీ డైట్ లో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా బ్రోకలీని తినటం అలవాటు చేసుకోవాలి.

పండ్లు

పండ్లలో అరటిపండును తినటం అలవాటు చేసుకోవాలి.అరటిపండు ఎముకలను బలంగా చేయటమే కాకుండా మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది.

పెరుగు

పెరుగులో ప్రోటీనుల మరియు క్యాల్షియం, విటమిన్ ఎ, బి, డి మరియు ఇలు సమృద్ధిగా ఉండుట వలన ఎత్తు పెరగటంతో సహాయపడతాయి.

క్యారెట్

క్యారెట్స్ లో విటిమన్ సి మరియు ఎలు సమృద్ధిగా ఉంటాయి.విటమిన్ ఎ ఎముకలకు అవసరం అయ్యే క్యాల్షియంను నిల్వ చేస్తుంది.దాంతో ఎముకలు బలంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube