కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలతో కొత్త కలలను కంటూ ఉంటారు.ఆ కలలు తీరాలని జీవితం ఆనందంగా గడవాలని కోరుకుంటారు.
కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చేది సంక్రాతి.సంక్రాతి పండుగను కుటుంబం అంతా చాలా సంతోషంతో జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు.సంక్రాతి రోజు కూతుళ్లు,అల్లుళ్ళు,మనవలతో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది.
సంక్రాతి రోజు ఒక రాగి నాణెంతో ఇలా చేస్తే చాలా మంచి జరగటమే కాకుండా ధన వర్షం కురుస్తుందట.ఇంటిలో గాని, వ్యాపారంలో గాని ఏమైనా కష్టాలు,నష్టాలు ఉంటే ఇప్పుడు చెప్పే పరిష్కారం చేస్తే ఆ సమస్యలు అన్ని సమసిపోతాయి.
సంక్రాతి రోజు ఉదయం ఇంటిలో గాని, వ్యాపారంలో డబ్బులు పెట్టె ప్రదేశంలో ఒక రాగి నాణెంను తీసుకోని దానితో మూడు సార్లు దిష్టి తీసి….ఆ నాణెంను ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దేవుడి ముందు పెట్టి ధన ప్రాప్తి కలిగించమని దేవుణ్ణి వేడుకోవాలి.
సాయంత్రం నాలుగు గంటలకు దేవుడి దగ్గర పెట్టిన మూటను పారే నీటిలో కలిపేయాలి.ఈ విధంగా సంక్రాతి రోజు చేస్తే కష్టాలు,నష్టాలు అన్ని తీరిపోయి ధన వృద్ధి కలుగుతుంది.