ఓ కెనడియన్ జర్నలిస్ట్‌కు వెస్ట్‌జెట్ విమానంలో( WestJet Flight ) చేదు అనుభవం ఎదురయ్యింది.ఆమె పేరు జోవన్నా చియు.
( Joanna Chiu ) మెక్సికో నుంచి కెనడాకు వెళ్లడానికి ఒక విమానం ఎక్కింది.అయితే ముందు ఆమె తిన్న ఫుడ్ పడక విరేచనాల సమస్య ఎదురయింది.
దాంతో ఆమె విమానం టేకాఫ్ కావడానికి ముందు చాలాసార్లు బాత్‌రూమ్‌కి ( Bathroom ) వెళ్లి రావడం చేసింది.దీనిని విమాన సిబ్బంది గమనించింది.
ఆమె అనారోగ్యంతో ఉందని, ఇతర ప్రయాణీకులకు వ్యాధి సోకుతుందేమో అని వెస్ట్‌జెట్ సిబ్బంది భయపడింది.
అందుకే ఆమెను విమానం నుండి దిగమని చెప్పింది.
మొదట ఆ తనకు ఎలాంటి అనారోగ్యం లేదని చెప్పినా సిబ్బంది వినిపించుకోకుండా ఆమెను బయటికి పంపించేశారు.కనీసం ఆమెకు హోటల్ లేదా మరొక విమానాన్ని సజెస్ట్ కూడా చేయలేదు.
జోవన్నా ఒంటరిగా, డబ్బులు కూడా లేకుండా విమానాశ్రయంలో మిగిలిపోయింది.డబ్బు విమానంలో ఉన్న తన స్నేహితుడి వద్ద ఆమె వదిలివేసింది.
దీనివల్ల ఏం చేయాలో తెలియక వెస్ట్‌జెట్ సూపర్‌వైజర్‌తో( WestJet Supervisor ) మాట్లాడటానికి ప్రయత్నించింది, కానీ అతను మొరటుగా ప్రవర్తించాడు.ఆమె తనపై తీసిన వీడియోను తొలగించాలని లేదా మరుసటి రోజు ఆమెను ఎగరనివ్వనని హెచ్చరించాడు.దాంతో జోవన్నా మరో వెస్ట్‌జెట్ ఉద్యోగిని కోరింది, కానీ అతను కూడా ఆమెకు నెక్స్ట్ ఫ్లైట్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.జోవన్నా కలత చెందింది, భయపడింది.
తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌లో పోస్ట్ చేసింది.చాలా మంది ఆ పోస్ట్‌ను చూసి ఆమెకు మద్దతు తెలిపారు.
వెస్ట్‌జెట్ చివరకు ఆమె బుకింగ్ నంబర్‌తో మెసేజ్ పంపింది.తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆమె టాక్సీలో హోటల్‌కు వెళ్లింది.
ఆ తర్వాత, తాను ఇంటికి క్షేమంగా వెళ్లానని పోస్ట్ చేసింది.ఈ సంఘటన ఎక్స్‌లో వైరల్ అయిన తర్వాత వెస్ట్‌జెట్ ఆమెకు క్షమాపణ చెప్పింది.
అయితే వెస్ట్‌జెట్ విమానం నుంచి జోవాన్నాను విమానాల నుంచి బయటికి పంపించడం మంచి నిర్ణయమే అని కొంతమంది షాకింగ్ కామెంట్ చేశారు.కడుపు నొప్పితో( Stomach Pain ) విమానంలో ప్రయాణించడం ఆమెకు, ఇతరులకు ప్రమాదకరమని వారు చెప్పారు.గాలి పీడనం, ఎత్తు ఆమె పరిస్థితిని మరింత దిగజార్చగలదని వారు చెప్పారు.ఆమె ఇతర ప్రయాణికులకు కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని వారు చెప్పారు.వెస్ట్‌జెట్ నిర్ణయంతో ఇతర వ్యక్తులు ఏకీభవించలేదు.వెస్ట్‌జెట్ జోనా పట్ల మరింత దయతో, సహాయకారిగా ఉండాలని వారు చెప్పారు.
బాత్‌రూమ్‌కి ఎక్కువగా వెళ్లినంత మాత్రాన ఆమెకు వైరస్ సోకిందని ఎలా చెప్తారు అని వారు ప్రశ్నించారు.