స్టార్ హీరోయిన్ లలో ఒకరైన ఆలియా భట్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.కుర్ర హీరోల నుండి సీనియర్ హీరోల వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అందరితో నటిస్తుంది.
ఈమె తన నటనతో తక్కువ సమయం లోనే అందరి చేత శబాష్ అనిపించుకుని స్టార్ హీరోయిన్ గా మారి పోయింది.
అలియా బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వీరి పెళ్లి ఏప్రిల్ 14న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. కపూర్ లకు వారసత్వంగా వస్తున్న వాస్తు లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
వీరి ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు నిన్నటితో తెరపడింది.
బాలీవుడ్ ప్రేమ జంట అలియా, రణబీర్ పెళ్లి తో ఒక్కటి అవ్వడంతో ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.
వీరు పెళ్లి కార్యక్రమం నుండి పెళ్లి వరకు తమ ఫోటోలు ఒక్కటి కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు.ఈ జంట పెళ్లి తర్వాత అఫిషియల్ గా సోషల్ మీడియా అకౌంట్ లో ఫోటోలను షేర్ చేసారు.
పెళ్లి బట్టల్లో ఇద్దరు కూడా మరింత అందంగా దర్శనం ఇచ్చారు.దీంతో ఈ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేసాయి.

ఇక పెళ్లి అవ్వగానే వీరిద్దరూ కూడా వెంటనే వర్క్ లో జాయిన్ అయ్యారు.అలియా మాములుగా ఫ్యాషన్ ను బాగా ఫాలో అవుతుంది. ట్రెండీ డ్రెస్ లతో ఎప్పుడు తన అభిమానులకు ఆకట్టు కుంటుంది.అయితే పెళ్లి తర్వాత అలియా తాజాగా తన వర్క్ కోసం బయటకు వచ్చినప్పుడు విమానాశ్రమంలో వివాహం తర్వాత మొదటిసారి బయట కనిపించింది.

నూతన వధువుగా అలియా దేవ్ నాగ్రి అనే బ్రాండ్ నుండి బ్రీజీ పాస్టెల్ పింక్ సల్వార్ సూట్ ధరించింది.ఇప్పుడు ఉన్న సమ్మర్ కు ఇది సరిగ్గా సరిపోయే డ్రెస్.అలియా వేసవి లుక్ చూసి నవ వధువు ఎంతగా మారిపోయింది.ఈ న్యూ లుక్ కూడా అదిరింది అంటూ ఆమె ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ ఫొటోలో ఈమె లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.పెళ్లి తర్వాత ఇదే తొలిసారి బయటకు రావడంతో ఈమెను మీడియా వారు చుట్టూ ముట్టారు.
ఇక అలియా, రణబీర్ స్నేహితుల కోసం భారీ స్థాయిలో రెసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.







