వావ్.. ఇలాంటి లాప్టాప్ చూసారా ఎప్పుడైనా..?!

టెక్నాలజీ ఎంతగా ముందుకు దూసుకుని పోతుందంటే మాటల్లో చెప్పలేము.ఇప్పటిదాకా మనం ఒక స్క్రీన్ లాప్ టాప్ తో వర్క్ చేసాము కదా.

 Wow Have You Ever Seen A Laptop Like This 2new Type Of Laptaop, 7 Screens, Ram A-TeluguStop.com

కానీ, బ్రిటన్‌కు చెందిన ఎక్స్‌ పాన్‌ స్కేప్‌ అనే కంపెనీ ఏకంగా ఏడు స్క్రీన్‌ లతో కూడిన ఒక ల్యాప్‌ టాప్‌ ను తయారుచేసింది.దీనికి   అరోరా 7 అనే పేరు కూడా పెట్టారు.

ఇప్పటిదాకా ప్రపంచంలోనే ఏడు స్క్రీన్‌లు ఉన్న తొలి ల్యాప్‌ టాప్‌ అరోరా అవ్వడం గమనార్హం.ఈ లాప్ టాప్ గురించి తెలిసి చాలమంది ముందుగా ఆర్డర్ కూడా పెట్టారట.

ఈ అరోరా లాప్ టాప్ ప్రస్తుతానికి పరీక్షల దశలో ఉంది.అన్నీ పరీక్షలు పూర్తి అయిన తరువాత  మార్కెట్లోకి విడుదల చేయనున్నారట.

ఇకపోతే ఈ ల్యాప్‌ టాప్ స్పెసిఫికేషన్స్ ఒకసారి పరిశీలిస్తే ఈ ల్యాప్‌ టాప్‌ లో ఇంటెల్ ఐ9 9900కే ప్రాసెసర్ ఉపయోగించారు.ఈ ల్యాప్‌ టాప్ 64 జీబీ ర్యామ్‌, 2టీబీ స్టోరేజ్  లో అందుబాటులో ఉంది.ఇందులోని ఏడు స్క్రీన్‌ లలో నాలుగు స్క్రీన్స్ 17.3 అంగుళాల 4కే రిజల్యూషన్‌ కలిగిన స్క్రీన్‌లు ఉంటాయి.అలాగే మిగిలిన మూడు స్క్రీన్లు 7 అంగుళాల ఫుల్ హెచ్‌ డీ తో తయారుచేయబడిన స్క్రీన్‌లు.అలాగే ఈ అరోరా ల్యాప్‌ టాప్ ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గంటపాటు నిరంతరాయంగా బ్యాటరీ పనిచేస్తుందని తెలిపారు.

ఈ ల్యాప్‌ టాప్ చూడడానికి ఒక బాక్స్ మాదిరిగా ఉంటుంది.ఈ ల్యాప్‌ టాప్‌ లో స్క్రీన్‌లు తెరుచుకునేందుకు మొత్తం 13 దశల అన్‌ ఫోల్డింగ్ వ్యవస్ధ ఉంటుంది.

అవసరం అనుకున్నప్పుడు మాత్రమే స్క్రీన్‌లను తెరిచి పనిచేసుకోవచ్చు.ఒకవేళ మీకు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్‌ లలో పనిచేయాలనుకున్న కూడా ఈ ల్యాప్‌ టాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ ల్యాప్‌ టాప్ ఎక్కువగా డేటా సైంటిస్టులకు, కంటెంట్ క్రియేటర్స్ కు, సైబర్ నిపుణులకు ఈ ల్యాప్‌ టాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube