ఆ దేశ పౌరులకు వీసా-ఫ్రీ ఎంట్రీ అందిస్తున్న చైనా..

కోవిడ్-19 తర్వాత పర్యాటక, ఆర్థిక సంబంధాలను పెంచుకోవడానికి చైనా కీలక నిర్ణయం తీసుకుంది.తాజాగా ఈ డ్రాగన్ కంట్రీ ఆరు యూరోపియన్ దేశాలు, మలేషియా పౌరులకు టెంపరరీ వీసా ఎగ్జంప్షన్ ప్రకటించింది.

 China Is Offering Visa-free Entry To Its Citizens , China, Visa Exemption, Six E-TeluguStop.com

వ్యాపారం, పర్యాటకం, బంధువులు, స్నేహితులను సందర్శించడం లేదా రవాణా కోసం 15 రోజుల వరకు చైనాను సందర్శించే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, మలేషియా ప్రయాణికులకు వీసా ఫ్రీ ఎంట్రీ విధానం వర్తిస్తుంది.ఈ విధానం 2023, డిసెంబర్ 1 నుంచి 2024, నవంబర్ 30 వరకు అమలులో ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శుక్రవారం తెలిపారు.

Telugu China, Covid, Malaysia, Nri, European, Tourism, Visa-Telugu NRI

మూడేళ్ల కఠినమైన కోవిడ్ 19 చర్యలను విధించిన తర్వాత చైనా( China ) క్రమంగా తన సరిహద్దులను బయటి ప్రపంచానికి తిరిగి తెరిచింది.కోవిడ్, మానవ హక్కులు, తైవాన్, వాణిజ్యం వంటి వివిధ సమస్యలపై అనేక పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలను ఎదుర్కొన్న తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజ్‌ను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది.24 దేశాలలో ప్యూ రీసెర్చ్ సెంటర్ ( Pew Research Center )ఇటీవల నిర్వహించిన సర్వేలో 67% మంది పెద్దలు చైనా పట్ల ప్రతికూల అభిప్రాయాలను కలిగి ఉన్నామని అన్నారు.వారిలో సగం మందికి పైగా చైనా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని, ఇతర దేశాల ప్రయోజనాలను గౌరవించదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu China, Covid, Malaysia, Nri, European, Tourism, Visa-Telugu NRI

వీసా మినహాయింపు నిర్ణయాన్ని ఆరు యూరోపియన్ దేశాలు, మలేషియా రాయబారులు, అధికారులు స్వాగతించారు, ఇది చైనా వారి దేశాల మధ్య ప్రయాణం, మార్పిడి, సహకారాన్ని సులభతరం చేస్తుందని వారి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.చైనాలోని జర్మనీ రాయబారి ప్యాట్రిసియా ఫ్లోర్( German Ambassador Patricia Flor ) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో మాట్లాడుతూ, ఈ నిర్ణయం చాలా మంది జర్మన్ పౌరులకు హెల్ప్ అవుతుందని అన్నారు.చైనా తన వీసా ఫ్రీ ట్రావెల్ విధానాన్ని నవంబర్‌లో నార్వేతో సహా 54 దేశాలకు విస్తరించింది.ఆగస్టులో ఇన్‌బౌండ్ ట్రావెలర్స్ కోసం అన్ని కోవిడ్ పరీక్ష అవసరాలను ఇది రద్దు చేసింది.

ఇది జులైలో సింగపూర్, బ్రూనై పౌరులకు 15 రోజుల వీసా ఫ్రీ ప్రవేశాన్ని తిరిగి ప్రారంభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube