సుబ్రమణ్య స్వామిని ఎలా పూజిస్తే సంతానం కలుగుతుంది.ఎప్పుడు పూజించాలి.
దీపావళి తర్వాత వచ్చే సుబ్రమణ్య షష్ఠి ని సుబ్బరాయ షష్ఠి,స్కంద షష్ఠి అని పిలుస్తారు.సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజును సుబ్రమణ్య షష్ఠిగా జరుపుకుంటారు.
ఈ పండుగను సుబ్రమణ్య స్వామి,కుమార స్వామి ఉన్న ప్రతి గుడిలోనూ జరుపుతారు.ఆ రోజున అభిషేకాలు,పూజలు జరుగుతాయి.
సర్ప రూపంలో ఆవిర్భవించిన కారణంగానే సుబ్రమణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నారు.అందుకే అయన విగ్రహ రూపంలోనే కాకుండా లింగ రూపంలోనూ సర్ప రూపంలోనూ పూజలు అభిషేకాలను అందుకుంటూ భక్తుల కోరికలను తిరిస్తూ ఉంటారు.
ఈ స్వామి వెలసిన ఆలయాలకు ఎక్కువగా మహిళ భక్తులు వస్తూ ఉంటారు.స్వామి వారు ఈ రూపంలో సంతానం లేని వారికి సంతానంను అనుగ్రహిస్తూ ఉంటారు.అందుకే మహిళ భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు.సుబ్రమణ్య స్వామిని ఎలా పూజిస్తె సంతానం కలుగుతుందో తెలుసుకుందాం.
తారకాసురుడు శివ సుతుని చేత మాత్రమే మరణం పొందేలా వరాన్ని బ్రహ్మ నుండి పొందాడు.తారకాసురుని చంపటానికి ఉద్భవించిన తేజో మయుడే సుబ్రమణ్య స్వామి.అయన జన్మించిన రోజునే సుబ్రమణ్య షష్ఠి గా వ్యవహరిస్తారు.తారకాసుర సంహారం సుబ్రమణ్య స్వామి జననానికి సంబంధం ఉంది.
బలవంతుడు అయినా తారకాసురుని సుబ్రమణ్య స్వామి జయించాడు.కనుక జయం కోరి ముందు అడుగు వేసేవారు ఈ స్వామిని కొలుస్తారు.
సుబ్రమణ్య స్వామి అనగానే నెమలి వాహనం,శక్తి ఆయుధాన్ని ధరించిన రూపం కనపడుతుంది.
ఈ స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి.
ఈ స్వామిని పూజిస్తే జాతక దోషాలు,పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెపుతున్నాయి.సుబ్రమణ్య షష్ఠి రోజున ఉదయమే తలస్నానము చేసి సుబ్రమణ్య స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని శక్తి కొలది దానాలు చేస్తే తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు పోతాయి.
సుబ్రమణ్య ప్రతిష్ట చేసిన వారికీ సంతానం కలుగుతుందని నమ్మకం ఉంది.షష్ఠి రోజున స్వామికి పాల కావిడి సమర్పించిన వారికీ సంతానం కలుగుతుంది.