ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్( Congress ) గట్టిగా దృష్టి పెట్టింది.ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉంది.
ఈ మద్య కాంగ్రెస్ పెరుగుతున్న బలం కారణంగా ఈసారి అధికారం గ్యారెంటీ అనే భావనతో ఉన్నారు హస్తంనేతలు.అందుకే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ.
ఇదిలా ఉంచితే మొన్నటివరకు వైఎస్ షర్మిల( Y S Sharmila ) విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేసింది.షర్మిల సపోర్ట్ ఉంటే పార్టీకి మేలని భావించిన హస్తం నేతలే ఇప్పుడు ఆమె అవసరం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
మొదట కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని సత్తా చాటలని షర్మిల భావించినప్పటికి హస్తం హైకమాండ్ అందుకు అంగీకరించకపోవడంతో చేసేదేమీ లేక ఒంటరిగానే బరిలోకి దిగాలని భావించింది.మళ్ళీ ఇంతలోనే టోటల్ గా ఎన్నికల బరిలో నుంచే తప్పుకొని హస్తంపార్టీకి పూర్తి మద్దతు ప్రకటించింది షర్మిల. అయితే ఆమె కాంగ్రెస్ కు మద్దతు తెలిపినప్పటికి.హస్తం పార్టీ నేతలు ఎవరు కూడా ఆమెకు సంఘీభవం చెప్పకపోవడం గమనార్హం.దీంతో ఇంతకీ షర్మిల విషయంలో కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.కాగా షర్మిలను కాంగ్రెస్ పార్టీ హైలెట్ చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన రాక మానదు.
వైఎస్ ప్రస్తావన వస్తే తెలంగాణ విషయంలో ఆయన చూపిన వ్యతిరేకత కూడా ఎన్నికల వేళ హాట్ టాపిక్ అవుతుంది.దాంతో ఆ పరిణామాలు కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తాయనే ఉద్దేశ్యంతో వ్యూహాత్మకంగా షర్మిలను కాంగ్రెస్ పార్టీలో హైలెట్ చేయకుండా ఆ పార్టీ నేతలు జాగ్రత పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.అందుకే ఆమెకు పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా ఎలాంటి పిలుపు ఇవ్వనట్లు తెలుస్తోంది. కానీ షర్మిల ( Y S Sharmila )మాత్రం తన మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని చెబుతూ పోలిటికల్ హీట్ పెంచుతున్నారు.
మరి ముందు రోజుల్లో షర్మిలను కూడా కాంగ్రెస్ ప్రచారల్లో ఉపయోగించుకునే అవకాశం ఉందా ? లేదా అసలు షర్మిల ప్రస్తావనే లేకుండా ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారా అనేది చూడాలి.