ప్రపంచంలో అత్యంత అరుదైన సంఘటనలు జరిగినప్పుడు గాని, సాధారణంగా ఉండే వాటికన్నా భిన్నంగా ఏవైనా ఉంటే, వాటిని ముందు తరాలకు తెలియజేయడానికి, ఫ్యూచర్ రెఫరన్స్ కోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చేరుస్తారు.అలాగే ఓ కుక్క చెవులు కూడా సాధారణంగా ఉండే దాని కన్నా భిన్నంగా ఉండడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది.
ఆ కుక్క విశేషాలేంటో.చూద్దాం
అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రానికి చెందిన మహిళ ఓ పెంపుడు కుక్కని పెంచుకుంటుంది.
ఆమె పేరు పైగ్ ఓల్సన్.తానొక వెటర్నరీ టెక్నీషియన్.ఈ మహిళ తన ఇంట్లో ఓ వేటకుక్కను పెంచుకుంటుంది.ఈ కుక్క చెవులు నలుపు, కమిలిన వర్ణాల కలయికతో అందంగా ఉంటాయి.ఆ మహిళ కుక్కను ముద్దుగా లౌ అని పిలుచుకుంటుంది.కరోనా లాక్డౌన్ సమయంలో తన పెంపుడు కుక్కతో టైం స్పెండ్ చేయడానికి వీలైనంత సమయం కేటాయించింది.
దీంతో ఓల్సన్ తన కుక్క చెవులు పొడవుగా ఉండడం చూసి వాటిని కొలిచి ఆశ్చర్యపోయింది.అయితే ఆమె పెంచుకుంటున్న కుక్క చెవులు 13.38 ఇంచుల పొడవుగా, 34 సెం.మీ.ఉన్నాయి.సాధారణంగా ఏ కుక్కకైనా చెవులు ఆరేడు అంగుళాలు మాత్రమే ఉంటాయి.
అయితే ఈ కుక్క చెవులు అంతకుమించి పొడవుగా ఉండడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.