టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో వరుణ్ తేజ్( Varun Tej ) ఒకరు కాగా వరుణ్ తేజ్ నటించిన సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి.వరుణ్ తేజ్ తన క్రష్ అని చెప్పే హీరోయిన్ల సంఖ్య తక్కువేం కాదు.
మెగా ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి వచ్చినా సింపుల్ గా ఉండటానికి వరుణ్ తేజ్ ఇష్టపడతారు.అయితే ప్రముఖ హీరోయిన్ వరుణ్ తేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న మల్లి సీరియల్( Malli serial ) తో పాపులారిటీని సంపాదించుకున్న దీపా జగదీష్ ( Deepa Jagdish )తన భర్త సాగర్ ముందే మీడియాతో మాట్లాడుతూ హీరో వరుణ్ తేజ్ అంటే తనకు చాలా అభిమానమని చెప్పుకొచ్చారు.వరుణ్ తేజ్ హైట్ నాకు చాలా ఇష్టమని ఫిదా మూవీ చూసి వరుణ్ తేజ్ కు నేను ఫిదా అయ్యానని ఆమె అన్నారు.
వరుణ్ కు లావణ్యతో నిశ్చితార్థం అయిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.
ఒకవేళ వరుణ్ లావణ్యల నిశ్చితార్థం జరగకపోయి ఉంటే మాత్రం వాళ్లిద్దరినీ నేనే చేసుకుందామని అనుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.మహేష్, బన్నీ టాలీవుడ్ లో ఇష్టమైన హీరోలు అని ఆర్య మూవీ చూసి బన్నీకి ఫ్యాన్ అయిపోయానని ఆమె చెప్పుకొచ్చారు.ఆర్య సినిమాలో పాటలు తనకు ఎంతగానో నచ్చాయని ఈ నటి వెల్లడించారు.
దీపా జగదీష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లావణ్య త్రిపాఠికి షాకిచ్చేలా దీపా జగదీష్ కామెంట్లు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దీపా జగదీష్ కామెంట్ల గురించి ఆమె భర్త స్పందిస్తూ చూస్తున్నా.చూస్తున్నా.
నాతో పాటు ప్రేక్షకులు కూడా చూస్తున్నారు అని చెప్పుకొచ్చారు.దీపా జగదీష్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.