పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితాన్ని ‘తొలిప్రేమ’ చిత్రానికి ముందు, ‘తొలిప్రేమ'( Tholiprema ) చిత్రానికి తర్వాత అని విభజించవచ్చు.అప్పటి వరకు కేవలం నలుగురిలో ఒకడిగా కొనసాగిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా ఇది.
అంతే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ గా కూడా పేరు తెచ్చుకుంది ఈ చిత్రం.ఇప్పటికీ కూడా ఈ సినిమాని చూసేందుకు యూత్ ఎంతో ఆసక్తి ని చూపిస్తారు, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఈ చిత్రాన్ని చూసి కాలక్షేపం చేస్తుంటారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూస్తున్నప్పుడు మనల్ని మనం అడ్డం లో చూసుకున్నట్టుగా అనిపిస్తాది.మన నిజజీవితంలో స్నేహితులతో ఎలా ఉంటామో, అమ్మాయి వెనుక ఎలా తిరుగుతామో, తల్లి తండ్రుల చేత ఎలా తిట్లు తింటామో, ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము.
అంత అద్భుతమైన సినిమా ఇది.
ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయినా నేటి తరం పవన్ కళ్యాణ్ అభిమానుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.అందుకే ఈ చిత్రాన్ని మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేసింది శ్రీ మాత క్రియేషన్స్ ( Sri Matha Creations ) లేటెస్ట్ 4K క్వాలిటీ తో చిత్రాన్ని రీ మాస్టర్ చేయించి నిన్ననే గ్రాండ్ గా విడుదల చేసారు.వాస్తవానికి ఈ సినిమాకి వచ్చే డబ్బులు జనసేన పార్టీ కి డొనేషన్ గా( Janasena Party Donations ) వెళ్లే ఛాన్స్ లేదని తెలుసుకున్న అభిమానులు, ఈ చిత్రాన్ని స్వచ్ఛందం గా బాయ్ కాట్ చెయ్యడానికి పిలుపుని ఇచ్చారు.
కానీ ఒక్క పిలుపుతో పవన్ కళ్యాణ్ ప్రభంజనం ని ఆపలేము కదా, అందులోనూ వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఇష్టమే.అందుకే ఈ సినిమాకి మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ ని ఇచ్చారు ఆడియన్స్.
అది కూడా అన్నీ చోట్ల ఉదయం ఆటలే అవ్వడం విశేషం.అయ్యినప్పటికీ కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్ షోస్ పడ్డాయి అంటే పవర్ స్టార్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే ఈ సినిమాకి కేవలం నైజాం ప్రాంతం లోని హైదరాబాద్ సిటీ( Hyderabad City ) లో మొదటి రోజు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట.అసలు ఫ్యాన్స్ పట్టించుకోని సినిమాకి, అది కూడా 1998 వ సంవత్సరం లో విడుదలైన సినిమాకి ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు.పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ కి ఇది ఒక నిదర్శనం గా చెప్పుకోవచ్చు.కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.
అక్కడ కూడా తెల్లవారు జాము నుండే హౌస్ ఫుల్ షోస్ పడ్డాయి.అలా మొత్తం మీద ఈ చిత్రానికి మొదటి రోజు కోటి 23 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు సమాచారం.
ఇదే సినిమాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు విడుదల చేసి ఉంటే మొదటి రోజే 10 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చేదని అభిమానులు అంటున్నారు.