ప్రస్తుత రోజుల్లో చాలామంది మేకప్( Makeup ) కు అలవాటు పడిపోయారు.అందరిలోనూ అందంగా కనిపించాలనే కారణంతో ముఖానికి మేకప్ తో మెరుగులు పెడుతున్నారు.
కానీ కొందరు మాత్రం మేకప్ లేకపోయినా అందంగా తెల్లగా కనిపిస్తూ ఉంటారు.అటువంటి చర్మాన్ని మీరు కూడా పొందాలి అనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ మీకు ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ క్రీమ్ ను తయారు చేసుకుని వాడారంటే సహజంగానే మీ చర్మం తెల్లగా కాంతివంతంగా మరియు అందంగా మెరుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక చిన్న క్యారెట్( carrot ) ను తీసుకుని సన్నగా తురుముకొని పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక ఆరెంజ్ పండుకు( orange fruit ) ఉన్న తొక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె( coconut oil ) వేసుకోవాలి.
అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పండు తొక్కలు మరియు క్యారెట్ తురుము వేసి ఉడికించాలి.దాదాపు పది నుంచి 15 నిమిషాల పాటు చిన్న పంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆపై ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకోవాలి.అలాగే ఐదు టేబుల్ స్పూన్లు క్యారెట్-ఆరెంజ్ పీల్ ఆయిల్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే మన క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ క్రీమ్ ను కనుక వాడారంటే మీ ముఖ చర్మం సహజంగానే తెల్లగా కాంతివంతంగా మారుతుంది.ముడతలు మచ్చలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.స్కిన్ టైట్ అవుతుంది.డార్క్ సర్కిల్స్ ఉంటే దూరం అవుతాయి.మేకప్ లేకపోయినా సరే మీరు తెల్లగా అందంగా మెరిసిపోతారు.