లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2కే రన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహించారు.

అనంతరం మండల కేంద్రము లో గల బస్ స్టాండ్ ఆవరణలో డయాబెటిస్ పై గురువారం ఉదయం మండల ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోట సతీష్ మాట్లాడుతూ డయాబెటిస్ ప్రమాదకర వ్యాధి కాదని ఎవరూ కూడా బయపడవద్దని ఆయన అన్నారు.పలువురికి డయాబెటిస్ పై ఉన్న అపోహలను తొలగించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు కోట సతీష్,లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ ఎర్రోజు దేవేందర్, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, బొయిని మహదేవ్ దుంపెన రమేష్, ,పయ్యావుల రామచంద్రం యాదవ్, నంది కిషన్,రాగుల మల్లారెడ్డి, పాటి దేవయ్య,రాగుల లింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
Advertisement

Latest Rajanna Sircilla News