టాలీవుడ్‌ 2021ః మొదటి మూడు నెలల్లో కేవలం మూడంటే మూడే

కాల గమనంలో ఈ ఏడాది మొదటి మూడు నెలలు ముగిసి పోయాయి.చూస్తూ ఉండగానే 2021 సంవత్సరం పావు వంతు పూర్తి అయ్యింది.

ఈ పావు వంతు సంవత్సరంలో టావుడ్‌ నుండి దాదాపుగా వంద సినిమాలు అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.కాని గుర్తింపు ఉన్న స్టార్స్‌ నటించినవి మాత్రం పది పదిహేను వరకు ఉన్నాయి.

వాటిలో సక్సెస్‌ దక్కించుకున్న సినిమాలు కేవలం మూడంటే మూడే.ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సక్సెస్‌ అయిన సినిమాల జాబితా చూస్తే జనవరిలో క్రాక్‌, ఫిబ్రవరిలో ఉప్పెన మార్చిలో జాతి రత్నాలు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఈ ఏడాదిలో సక్సెస్‌లు ఏంటీ అంటే ఈ మూడు పేర్లు తప్ప మరేమి వినిపించడం లేదు.ఎన్నో సినిమాలు వచ్చిన ఈ మూడు నెలల్లో ఇంకా మూడే సినిమాలు సక్సెస్‌ అవ్వడం ఇండస్ట్రీకి కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే.

Advertisement

కాని రాబోయే రోజులు బడా స్టార్స్ సినిమాలు ఉన్న కారణంగా తప్పకుండా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ లు ఖాయం అంటున్నారు.ఈ ఏడాదిలో భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమాల విషయానికి వస్తే.

క్రాక్‌, రెడ్‌, అల్లుడు అదుర్స్‌, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఉప్పెన, కపటధారి, చెక్‌, ఎ1 ఎక్స్‌ ప్రెస్‌, శ్రీకారం, గాలి సంపత్‌, జాతి రత్నాలు, చావు కబురు చల్లగా, మోసగాళ్లు, రంగ్‌ దే, అరణ్య, తెల్లవారితే గురు వారం.ఈ సినిమాలో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి.

కాని ఈ సినిమాల్లో కేవలం క్రాక్‌, ఉప్పెన, జాతి రత్నాలు మాత్రమే సక్సెస్‌ అయ్యాయి.కపటధారి, శ్రీకారం, రంగ్‌ దే సినిమాలు యావరేజ్‌ టాక్ దక్కించుకోగా మిగిలిన సినిమాలు తీవ్రంగా నిరాశ పర్చాయి.

ముఖ్యంగా మోసగాళ్లు సినిమా 50 కోట్లతో నిర్మిస్తే కనీసం కోటి రూపాయలు వసూళ్లు చేయలేదు.ఇవి కాకుండా చిన్నా చితకా సినిమాలు చాలానే వచ్చాయి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

వాటి గురించి అసలు మాట్లాడుకోవడం కూడా వృదా అన్నట్లుగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు