హెచ్ -4 వీసాపై తీపి కబురు..

హెచ్-1బీ ,హెచ్ -4 వీసాల అంశం తో భారత ఎన్నారై లకి రోజు రోజు కి టెన్షన్ పెరిగిపోతోంది.

హెచ్‌-1బీ వీసాల మంజూరులో నిబంధనలు విధించి నియంత్రణ చేసిన అ మెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ తర్వాత డ్రీమర్స్‌ విష యంలో కూడా అదే విధంగా నిర్ణయాలు తీసుకోవడంతో భారతీయులలో మరింత ఆందోళన నెలకొంది.

ఒబామా ప్రభుత్వం ఈ డ్రీమర్స్ విషయంలో వారి జీవిత భాగస్వాములు కూడా హెచ్‌-4 వీసాలు మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే.అయితే.

అయితే ట్రంప్ మాత్రం తమ పౌరులకోసం తీసుకున్న ఈ వీసాల నిభంధనల విషయంలో ఎంతో మంది భారతీయులు వెనక్కి వచ్చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.అయితే కొన్ని రోజుల క్రితం హెచ్ -4 విషయంలో ఖటినమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఆ వీసాలపై ఆంక్షలు విధించవద్దు అంటూ అమెరికా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది.అయితే ఈ విషయం లో ట్రంప్‌ తీసు కునే నిర్ణయంపై భారతీయమహిళలు ఉద్యోగా లు చేసే అంశం ఆధార పడి ఉంటుంది.

కాగా హెచ్‌-4 వీసాదారుల వర్క్‌ పర్మిట్లను రద్దు చేయడంపై తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అంటూ అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు తెలిపారు.ఉద్యోగ ఆధారిత వీసాలపై పూర్తిస్థాయి చట్టం వచ్చేంతవరకూ కూడా వీటిపై తుది నిర్ణయం తీస్కోమని చెప్పారు.హెచ్‌-4 వీసాదారుల వర్క్‌ పర్మిట్లు రద్దు చేయొద్దని కోరుతూ 130 మంది అమెరికా చట్టసభ సభ్యులు ట్రంప్‌ యంత్రాంగానికి ఇటీవలే లేఖ రాశారు.దాంతో ఈ వీసాలపై నిర్ణయం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్ సీఐఎస్‌) అధికారి స్పష్టత ఇచ్చారు.

Advertisement
భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. భారీగా ఎన్ఆర్ఐల రిజిస్ట్రేషన్లు
Advertisement

తాజా వార్తలు