కాంగ్రెస్ -బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు..: కేటీఆర్

కాంగ్రెస్, బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.బీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ -బీజేపీ చూస్తున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్ -బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని కేటీఆర్ తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోస్ సాక్షిగా అదానీతో ఒప్పందాలు చేసుకున్నారన్నారు.

కాంగ్రెస్ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.ఢిల్లీలో కాంగ్రెస్ అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో అదానీతో కలిసి పని చేస్తోందని ఆరోపించారు.

బీజేపీ ఆదేశాలతోనే అదానీతో రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు