భారీగా వైసిపి ఇన్చార్జిల మార్పు ?  ఏకంగా 82 సీట్లలో ..

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎన్నో సంచలనాలు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి.

వై నాట్ 175 అనే నిదానదాన్ని వినిపిస్తున్న ఆ పార్టీ అధినేత,  ఏపీ సీఎం జగన్ కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

ఇదే విషయాన్ని పదే పదే పార్టీ శ్రేణులకు చెబుతున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ,వారిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత , ప్రభుత్వంపై ఏ ఏ విషయాల్లో ప్రజల్లో సానుకూలత ఉంది ఏ విషయాల్లో వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తే గెలుపు ఖాయం అనే విషయాల పైన దృష్టి సారించారు.దీనిలో భాగంగానే భారీగా నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చే పనిలో నిమగ్నమయ్యారు.

ఇప్పటికే 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.తాజాగా సర్వే నివేదికల ఆధారంగా భారీగా ఇన్చార్జిలను మార్చేందుకు జగన్ నిర్ణయించుకున్నారనే ప్రచారం ఇప్పుడు వైసీపీలో మొదలైంది.

Advertisement

దాదాపు 82 సీట్లలో మార్పులు చేయబోతున్నట్లు మీడియా,  సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఆ జాబితా ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస,  పాతపట్నం ,టెక్కిలి ఇచ్చాపురం, విజయనగరం జిల్లాలోని రాజం, బొబ్బిలి,  ఎచ్చెర్ల ,విశాఖపట్నం జిల్లా గాజువాక ,విశాఖపట్నం సౌత్, అనకాపల్లి జిల్లా పెందుర్తి ,పాయకరావుపేట,  చోడవరం , అనకాపల్లి , అరకు జిల్లాలోని అరకు,  పాడేరు లు ఉన్నాయి.

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు,  జగ్గంపేట పిఠాపురం, అమలాపురం జిల్లా అమలాపురం రాజోలు, రామచంద్రపురం , పి.గన్నవరం తో పాటు రాజమండ్రి సిటీ ఇన్చార్జులను మార్చనున్నారట.

అదే విధంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం ,ఉండి సీట్ల లోనూ మార్కులు జరగనున్నాయట.ఏలూరు జిల్లా చింతలపూడి,  పోలవరం , ఉంగుటూరు, మచిలీపట్నం జిల్లా అవనిగడ్డ,  పెడన,  ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ,  తిరువూరు,  విజయవాడ వెస్ట్,  విజయవాడ సెంట్రల్,  జగ్గయ్యపేట తదితర నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చనున్నారనే ప్రచారం జరుగుతుంది.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు