ఈ యూట్యూబ్ హీరో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అల్లుడని మీకు తెలుసా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు నువ్వు లేక నేను లేను, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ, ప్రేమ కావాలి, స్వయం వరం, నువ్వే కావాలి, తదితర హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు "కె.

విజయ భాస్కర్" గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే ఒకప్పుడు పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.విజయ భాస్కర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి కొంత మేర దూరంగా ఉంటున్నాడు.అయితే కె.విజయ భాస్కర్ అల్లుడు కూడా మనందరికీ బాగా తెలిసిన నటుడని చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.ఇప్పుడు విజయ భాస్కర్ అల్లుడు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

కె.విజయ భాస్కర్ అల్లుడు ఎవరో కాదు యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన షార్ట్ ఫిలిమ్స్ హీరో "రవి శివ తేజ".

ఇతడు దాదాపుగా పది సంవత్సరాల నుంచి పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోగా నటిస్తూ బాగానే ప్రేక్షకులని అలరిస్తున్నాడు.కాగా ఇటీవలే యూట్యూబ్ లో బాగా హిట్ అయిన "సూర్య వెబ్ సీరిస్" లో హీరో షణ్ముక్ స్నేహితుడి పాత్రలో నటించి బాగానే ఆకట్టుకున్నాడు.

Advertisement
Do You Know These Youtuber Ravi Shiva Teja Is Son In Law To The Tollywood Star D

తాజాగా రవి శివ తేజ తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఇందులో భాగంగా తాను 2015 సంవత్సరంలో తన భార్య శ్యామని ని జిమ్ లో కలిశానని తెలిపాడు.

అంతేకాకుండా తన ప్రేమని ప్రపోజ్ చేసినప్పుడు శ్యామని తండ్రి ప్రముఖ దర్శకుడు కె.విజయ భాస్కర్ అని తనకు తెలియదని, అంతేగాక ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి కూడా తనకు ఏమాత్రం తెలియదని చెప్పుకొచ్చాడు.

కానీ తన ప్రియురాలి తండ్రి ఫేమస్ డైరెక్టర్ అని తెలియడంతో వెంటనే రాత్రికి రాత్రే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తన స్వగ్రామానికి వెళ్లిపోయానని తెలిపాడు.కానీ ఆ తర్వాత తనకు తాను సర్దిచెప్పుకొని మళ్లీ హైదరాబాద్ వచ్చి శ్యామనీతో మాట్లాడడంతో అంతా సెట్ అయిందని చెప్పుకొచ్చాడు.

Do You Know These Youtuber Ravi Shiva Teja Is Son In Law To The Tollywood Star D

అయితే తన పెళ్లి విషయం కే.విజయ భాస్కర్ తో మాట్లాడినప్పుడు తను బాగా టెన్షన్ పడ్డానని కానీ తన భార్య శ్యామని మరియు తన అత్తయ్య బాగా సపోర్ట్ చేశారని దాంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా తన పెళ్లి జరిగిందని తెలిపాడు.నటన పరంగా తన మామ కె.విజయ భాస్కర్ అప్పుడప్పుడు పలు మెళుకువలను చెబుతుంటాడని తెలిపాడు.అంతేగాక కె.విజయ భాస్కర్ తన పిల్లల నిర్ణయాలకు బాగా విలువ ఇస్తాడనని అందువల్లే తమ పెళ్లి జరిగిందని, అలాగే తనని అల్లుడిలా కాకుండా సొంత కొడుకులాగా చూసుకుంటారని తెలిపాడు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు