మ‌చ్చ‌ల్లేని మెరిసే ముఖానికి మినుములు..ఎలావాడాలంటే?

మొటిమ‌లు, మ‌చ్చ‌లు లేకుండా ముఖం అందంగా, కాంతివంతంగా క‌నిపించాల‌ని అంద‌రూ కోరుకుంటారు.

అందు కోసం ఎంతో ఖ‌ర్చు పెట్టి ఫేస్ క్రీములు, లోష‌న్లు, మాయిశ్చరైజర్లు ఇలా ఎన్నో కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయితే ఇలాంటి ఖ‌రీదైన ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం వ‌ల్ల ఫ‌లితం ఎంత ఉంటుందో ప‌క్క‌న పెడితే భ‌విష్య‌త్తుల‌తో అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ఎందుకంటే, ఇలాంటి ప్రోడెక్ట్స్‌లో అనేక కెమిక‌ల్స్ క‌లుపుతుంటారు.

అవి చ‌ర్మానికి హాని చేకూరుస్తాయి.అందుకే న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తిలోనే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

ముఖ్యంగా మ‌చ్చ‌ల్లేని మెరిసే ముఖాన్ని అందించ‌డంలో మినుములు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి మినుములను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా మినుముల‌ను మొత్త‌గా పౌడ‌ర్ చేసేసుకోవాలి.ఇప్పుడు ఈ మినుముల పౌడ‌ర్‌లో, పాలు మ‌రియు రోజ్ వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.

పావు గంట పాటు ఆర‌నిచ్చి అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే ముఖంపై ఉండే మొటిముల‌, మ‌చ్చ‌లు పోయి కాంతివంతంగా మారుతంది.

అలాగే జిడ్డు చ‌ర్మంతో బాధ ప‌డే వారికి కూడా మినుములు గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.మినుముల పౌడ‌ర్‌, చిటికెడు ప‌సుపు మ‌రియు తేనె వేసి క‌లిప ముఖానికి అప్లై చేయాలి.ఇరవై నిమిషాల పాటు డ్రై అయిన అనంత‌రం కూల్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేస్తే ముఖంపై జిడ్డు పోయి ఫ్రెష్‌గా మారుతంది.ఇక ముడ‌త‌లు ఉన్న ఉన్న వారు.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
ఎన్టీఆర్ యాక్షన్ షురూ చేసేది అప్పుడేనట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మినుముల పౌడ‌ర్‌లో కొద్దిగా బాదం పేస్ట్ మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూత‌లా వేసుకుని.

Advertisement

పూర్తిగా డ్రై అయిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తే.

క్ర‌మంగా ముడ‌త‌లు పోయి ముఖం అందంగా మెరుస్తుంది.

తాజా వార్తలు