ల‌వంగాల పాలు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే రోజూ తాగేస్తారు..!

ల‌వంగాలు,( Cloves ) పాలు.( Milk ) ఇవి రెండు విడివిడిగా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే రెట్టింపు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని మీకు తెలుసా? అవును ల‌వంగాల పాలు శరీరానికి అత్యంత శ్రేయస్కరం.అందులోనూ ప్ర‌స్తుత చ‌లికాలంలో తీసుకోద‌గ్గ ఉత్త‌మ పానీయాల్లో ల‌వంగాల పాలు ఒక‌టి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ల‌వంగాల పాలు అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేంటో తెలుసుకుందాం ప‌దండి.ల‌వంగాల పాలు తయారు చేసుకోవ‌డం చాలా సుల‌భం.

ఒక క‌ప్పు లో-ఫ్యాట్ మిల్క్( Low Fat Milk ) తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు ల‌వంగాలు వేసి బాగా మ‌రిగించాలి.ఇలా మ‌రిగించిన మిల్క్ ను ఫిల్ట‌ర్ చేసుకుని అవసరమైతే తేనె( Honey ) క‌లిపి తాగేయ‌డ‌మే.

Advertisement

శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో ల‌వంగాల పాలు చాలా ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డ‌తాయి.వింట‌ర్ లో వేధించే జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌కు ఈ మిల్క్ ఒక న్యాచుర‌ల్ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.

అలాగే లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నిండి ఉంటాయి.ల‌వంగాల‌ను పాలలో క‌లిపి తాగ‌డం వ‌ల్ల‌ శరీర రోగ నిరోధక శక్తి( Immunity Power ) రెట్టింపు అవుతుంది.సీజ‌న‌ల్ వ్యాధుల‌తో పోరాడే సామ‌ర్థ్యం ల‌భిస్తుంది.

కీళ్ళ నొప్పులతో బాధ‌ప‌డేవారు ప్ర‌తిరోజూ నైట్ ఒక గ్లాస్ ల‌వంగాల పాలు తీసుకోవ‌డం మంచి ఎంపిక అవుతుంది.ఎందుకంటే ల‌వంగాలు నొప్పి నివారణిగా ప‌ని చేస్తాయి.

పాలు ఎముక‌ల‌ను బ‌లోపేతం చేస్తాయి.

అంత గొప్ప వ్యక్తినే ట్రోల్ చేశారు నేనెంత.. దర్శకుడు బాబీ కామెంట్స్ వైరల్!
వాళ్ల టైప్ లో సాయిపల్లవి సింపుల్ గా ఉంటుంది.. చందూ మొండేటి క్రేజీ కామెంట్స్ వైరల్!

మంచి నిద్ర‌ను పొందాల‌నుకుంటే త‌ప్ప‌కుండా ల‌వంగాల పాలును డైట్ లో చేర్చుకోండి.లవంగాల పాలు మానసిక ఆందోళనను త‌గ్గిస్తాయి.వెంట‌నే నిద్ర‌లోకి జారుకునేందుకు స‌హాయ‌ప‌డ‌ట‌మే కాకుండా నిద్ర నాణ్య‌త‌ను పెంచుతాయి.

Advertisement

అంతేకాకుండా ల‌వంగాల పాటు గుండెకు రక్త ప్రసరణను మెరుగుప‌రుస్తాయి.హృదయ సంబంధిత వ్యాధులు వ‌చ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

జీర్ణ వ్యవస్థ ప‌నితీరు కూడా పెంచుతాయి.

తాజా వార్తలు