జుట్టు రాలడం,( Hairfall ) చుండ్రు.( Dandruff ) అత్యంత కామన్ గా వేధించే సమస్యలు ఇవి.వీటితో ఆడవారే కాదు మగవారు కూడా ఇబ్బంది పడుతుంటారు.రాలిపోయే జుట్టును ఎలా అడ్డుకోవాలో తెలియక.
చుండ్రు సమస్యను ఏ విధంగా వదిలించుకోవాలో అర్థం కాక తెగ మదన పడిపోతూ ఉంటారు.అయితే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టే పవర్ ఫుల్ ఆయిల్ ఒకటి ఉంది.
ఆ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? ఆ ఆయిల్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు లభిస్తాయి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు లవంగాలు,( Cloves ) రెండు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek Seeds ) అర కప్పు ఎండిన కరివేపాకు,( Curry Leaves ) అర కప్పు ఎండిన మునగాకు( Moringa leaves ) వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న మెంతులు, లవంగాలు, కరివేపాకు, మునగాకు పొడిని వేసుకోవాలి.అలాగే ఒక కప్పు కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా కలిపి మూత పెట్టి మూడు రోజుల పాటు పక్కన పెట్టేయాలి.మూడు రోజులు గడిచిన అనంతరం క్లాత్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.
ఈ ఆయిల్ కేశ సంరక్షణలో అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మంచిగా మసాజ్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే జుట్టు దృఢంగా ఆరోగ్యంగా మారుతుంది.జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.అదే సమయంలో జుట్టుకు చక్కని పోషణ అంది దట్టంగా పెరుగుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల చుండ్రు సమస్యను శాశ్వతంగా వదిలించుకోవచ్చు.
చుండ్రును సంపూర్ణంగా నివారించడంలో ఇప్పుడు చెప్పుకున్న ఆయిల్ ఉత్తమంగా సహాయపడుతుంది.