వైరల్: రక్తంతో సినిమా పోస్టర్ తయారు చేసిన మహిళ..!

"ది కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమాకి రోజు రోజుకు మంచి హైప్ వస్తుంది.

ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షతులవుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని చూసిన ఒక మహిళ ఏమి చేసిందో తెలిస్తే మీరే షాక్ అవుతారు.

సినిమా మీద ఉన్నా ఇష్టంతో ఒక మహిళ స్వయంగా తన రక్తంతో సినిమాకు సంబందించిన పోస్టర్‌ను రూపొందించింది.వివరాల్లోకి వెళితే.

మంజు సోనీ అనే మహిళ "ది కశ్మీర్ ఫైల్స్" అనే సినిమా చూసి సినిమా మీద ఉన్న ఇష్టంతో తన రక్తంతో సినిమాకు సంబందించిన పోస్టర్ ను బొమ్మలాగా వేసింది.ఈ పోస్టర్ చూసిన సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆమెకు స్పెషల్ గా ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు కూడా తెలపడం విశేషం అనే చెప్పాలి.

Advertisement
Woman Draw The Kashmir Files Movie Poster With Blood Details, Viral Latest, Vir

దర్శకుడు అగ్నిహోత్రి ట్విట్టర్‌లో ఆమెకు ధన్యవాదములు తెలియచేస్తూ ఇలా కామెంట్ కూడా పెట్టారు.ఓ మై గాడ్ అసలు నమ్మశక్యంగా లేదు.

ఈ చిత్రం చూసిన తరువాత నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు.ఈ చిత్రం గీసిన మంజు సోనీ జీకి అసలు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు.

Woman Draw The Kashmir Files Movie Poster With Blood Details, Viral Latest, Vir

మీలో ఎవరికైనా ఆమె గురించి తెలిసినట్లయితే దయచేసి ఆమె వివరాలు నా DMలో పంచుకోండి అని నెటిజన్లకు తెలిపారు.ప్రస్తుతం రక్తంతో మంజు సోనీ గీసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.అయితే ఈ పోస్టర్స్ చూసిన నేటిజన్లు మాత్రం ఇలా చేయడం సరికాదు అని అంటున్నారు.

సినిమా బాగుంది.సినిమా మీద ఇష్టం అయితే ఉండొచ్చు గాని మరి ఇలా ప్రాణాలకు తెగించి రక్తంతో పోస్టర్ గీయడం సరికాదు అంటున్నారు.

రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!
Advertisement

తాజా వార్తలు