విద్యుత్ఘాతంతో మహిళ మృతి

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన మహిళా అనంతు లక్ష్మీ(46) విద్యుత్ఘాతంతో మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపింది.

వివరాల్లోకి వెళితే మంగళవారం పోనుగోడు గ్రామ పరిధిలోని ఊరి బయట అనంతు లక్ష్మీ పశువులను కాస్తూ ఉండగా వ్యవసాయ భూమిలో విద్యుత్ స్తంభాల తీగలు మనిషికి తగిలేటట్టు ప్రమాదకరంగా ఉండటాన్ని గమనించక పశువుల కోసం వెళ్తుండగా కిందకు వాలిన విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృతి చెందింది.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు,గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహంతో మిర్యాలగూడ-సూర్యాపేట రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి ఆందోళనకు దిగారు.దీనితో దాదాపు గంటన్నర పాటు ఆ రహదారిలో 2 రెండు కి.మీ.మేర ట్రాఫిక్ జామ్ అయింది.ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

కానీ,తమకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని వారు భీష్మించుకుని కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఈ సందర్భంగా మృతురాలి బంధువులు మాట్లాడుతూ కేవలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిందని,విద్యుత్ సరఫరా అవుతున్న తీగలు మనిషికి తగిలే ఎత్తులో ఉంటే అధికారులకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.గత నాలుగు సంవత్సరాల క్రితం మృతురాలి భర్త చనిపోగా,ఇప్పుడు తల్లి చనిపోవడంతో వారి ఇద్దరు కూతుర్లు దిక్కులేని వారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకు తగు న్యాయం చేసే వరకు ఈ పోరాటం ఆపేది లేదని తెగేసి చెప్పారు.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్
Advertisement

Latest Suryapet News