భర్తను చంపమని ప్రియుడ్ని పురమాయించిన భార్య.. చివరకు..

ఈ మధ్య పవిత్రమైన వివాహబంధం వివాహేతర సంబంధాల కారణంగా అపవిత్రం అవుతున్నాయి.పరాయి వ్యక్తిపై వ్యామోహం వల్ల అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని ఒక్కటైన బంధాన్ని మర్చిపోతున్నారు.

భార్యాభర్తల మధ్య పరపురుషుడు రావడం వల్ల అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు కూడా గొడవలు పడుతున్నారు.ఆ గొడవలు కాస్తా పెద్దగా అవ్వడంతో ఒకరిని ఒకరు చంపుకునే వరకు వెళ్తున్నారు.

Wife Kills Husband With The Help Of Her Boy Friend, Crime News, Extramarital Aff

తాజాగా కరీంనగర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.పరాయి వ్యక్తి మోజులో పడి తాళి కట్టిన భర్తనే తనకు అడ్డు తొలగించుకోవడానికి చంపాలనుకుంది.

ప్రియుడి చేతనే కట్టుకున్న భర్తను హతమార్చాలని ప్లాన్ వేసింది.ఆ విషయాన్నీ ప్రియుడికి చెప్పడంతో అతడు ఆమె భర్తను బయటకు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి మత్తులో ఉండగానే కెనాల్లోకి తోసేసాడు.

Advertisement

ఆమె ఏమి ఎరగనట్టు పోలీసులకు తన భర్త కనిపించడంలేదని ఫిర్యాదు చేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంరేకుర్తి గ్రామానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు.అతను మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

రాజయ్య భార్య లత కూడా తాపీ పనికి వెళ్ళేది.ఈ క్రమంలో లతకు ఆమె పనిచేస్తున్న మేస్త్రీ బాబుకు మధ్య వివాహేతర సంభందం ఏర్పడింది.

వారిద్దరూ సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన భర్త లతను హెచ్చరించాడు.అయితే లత తనకు అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చాలని అనుకుని ఈ విషయాన్నీ బాబుకు చెప్పడంతో అతడు ఫిబ్రవరి 5 నరాజయ్యను ఫంక్షన్ ఉందని బయటకు తీసుకెళ్లాడు.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
హమ్మో, ఎగిరే కారు వచ్చేసింది.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!!

బాబు తన గ్రామానికి తీసుకెళ్లి రాజయ్యకు ఫుల్లుగా కల్లు తాగించాడు.తర్వాత అతడిని ఆటోలో ఎక్కించుకుని రాత్రి 7 గంటల సమయంలో ఎస్సారెస్పీ కెనాల్ దగ్గరకు తీసుకెళ్లి అతడిని తోసేసాడు.

Advertisement

తర్వాత లత ఏమి ఎరగనట్టు తన భర్త కనపడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు ఎంత వెతికిన రాజయ్య కనిపించలేదు.

రాజయ్య మృతదేహం దాదాపు 150 కిలోమీటర్లు నీటిలో కొట్టుకుపోయి మహబూబాబాద్ పోలీసులకు దొరికింది.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు లతను, ఆమె బంధువులను అక్కడికి తీసుకెళ్లి రాజయ్య మృతదేహాన్ని గుర్తించారు.

లత కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు అనుమానం వచ్చి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసారు.

తాజా వార్తలు