సినిమా వాళ్ళ దెబ్బకి విశ్వక్ సేన్ అడ్రస్ మార్చేశాడట !

విశ్వక్ సేన్.( Vishwak Sen ) ఈమధ్య ఎక్కడ చూసినా ఈ కుర్ర హీరో హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది.

తనతో పాటే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది అడ్రస్ గల్లంతయితే ఇతడు మాత్రమే తనదైనా మాటల తీరుతో, స్క్రిప్ట్ సెలక్షన్స్ తో మంచి సినిమాలు తీసి అందరి దృష్టిలో పడ్డాడు.కేవలం హీరో గానే కాదు ఇటీవల కాలంలో నిర్మాతగా, డైరెక్టర్ గా కూడా మారాడు.

తన సినిమాలను తానే సొంతంగా తీసుకుంటున్నాడు.మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న విశ్వక్ సేన్ ఈ మధ్యకాలంలో ఎవరికి దొరక్కుండా అడ్రస్ మార్చేశాడట.

అందులో విశేషమేముందండి ఇల్లు మారారేమో అని అనుకుంటున్నారేమో.విషయం అదే అయినప్పటికి అందులో కాస్త విశేషం కూడా ఉంది.

Advertisement
Why Vishwak Sen Address Changed Details, Vishwak Sen, Hero Vishwak Sen, Vishwak

సినిమా వాళ్ల దెబ్బకే విశ్వక్ సేన్ ఇల్లు మారాడట.మరి అంతలా జనాలు ఆయన్ని ఏమి ఇబ్బంది పెట్టారు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Why Vishwak Sen Address Changed Details, Vishwak Sen, Hero Vishwak Sen, Vishwak

విశ్వక్ సేన్ చాలా బాగా మాట్లాడుతాడు.బాగా సినిమాలు తీస్తాడు.అంతే బాగా స్టేజిపై తన స్పీచ్ తో ఇరగదీయగలడు.

అందుకే ఈ మధ్యకాలంలో చిన్నా సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా చాలామంది విశ్వక్ సేన్ తో ట్రైలర్, టీజర్ లాంచ్ చేయించుకోవడమే కాదు.ఏకంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లకి( Pre Release Events ) కూడా అతనినే గెస్ట్ గా పిలుస్తున్నారు.

విశ్వక్ సేన్ స్టేజ్ పైన నాలుగు మాటలు మాట్లాడితే సదరు సినిమా వారికి ప్రమోషన్ అవుతుంది అనే తాపత్రయంతో అలా ప్రతి ఒక్కరూ విశ్వక్ సేన్ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారట.మొదట్లో తన వల్ల ఒక సినిమాకి ఎంతో కొంత లాభం జరుగుతుంది అంటే రావడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

కానీ రాను రాను వీటి వల్ల తనకు ఖాళీ లేకుండా పోతుందట.ప్రతి ఒక్కరూ నేరుగా ఇంటికి వచ్చేసి తమ సినిమాకి ఏదో ఒకటి చేయండి అంటూ అడుగుతున్నారట.

Advertisement

కొన్నాళ్లు భరించిన తర్వాత విశ్వక్ సేన్ ఇక లాభం లేదు అనుకొని ఫిలింనగర్ లో( Filmnagar ) తన సొంత ఇల్లును కాదు అనుకుని గచ్చిబౌలిలో కొనుక్కున్న అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయిపోయాడట.మాదాపూర్ లోని తన ఆఫీస్ కి కూడా చాలా తక్కువగా వస్తున్నారట.ఇలా టాలీవుడ్ లోని చిన్న సినిమాల దెబ్బకు విశ్వక్ సేన్ సొంత ఇంటిని వదులుకొని చిన్న ఫ్లాట్ లోకి షిఫ్ట్ అవడమే ఇప్పుడు అందరికి ఆసక్తిని కలిగిస్తుంది.

ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికొస్తే ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavari ) చిత్రాన్ని విడుదల చేసిన సంగతి మనందరికి తెలిసిందే.ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ వచ్చింది.

తాజా వార్తలు