ఏకంగా ఇంటికి వచ్చి అమితాబ్ ను బెదిరించింది ఎవరో తెలుసా?

భారతీయ సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు అమితాబ్‌ బచ్చన్‌.ఎనిమిది పదుల వయసున్నా.

యంగ్ స్టార్స్ తో పోటీపడి నటిస్తున్నాడు.ఎంతో యాక్టివ్ గా పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నాడు.

కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగిస్తున్నాడు.అయితే అమితాబ్ జీవితంలో పలు ఎత్తుపల్లాలున్నాయి.

ఆయన సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ ఓసారి పూర్తిగా నష్టపోయాడు.తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యాడు.

Advertisement

అంతేకాదు.సుమారు 900 కోట్ల రూపాయల అప్పు చేశాడట.

అప్పిచ్చిన వ్యక్తులు తనతో ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేను అంటాడు ఆయన.ఇంటికి వచ్చి మరీ గొడవ చేశాడని చెప్తారు.తను అనుభవించిన కష్టాల గురించి తాజాగా ఓ పత్రికకు ఇచ్చి ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించాడు.

తన 44 ఏళ్ల నా సినీ కెరీర్‌లో 1999 నిజంగా ఊహించని ఇబ్బందులకు గురి చేసిందన్నారు.ఆ సమయంలో తాను స్థాపించిన ఓ వెంచర్ సక్సెస్ కాక అనేక ఇబ్బందులు పడ్డట్లు చెప్పాడు.

దీని కారణంగానే సుమారు 900 కోట్ల రూపాయలు అప్పు అయినట్లు వెల్లడించారు.అప్పుల వాళ్లు నిత్యం ఇంటికి వచ్చేవారని చెప్పారు.పరుషపదజాలంతో తిట్టడంతో పాటు మరికొందరు బెదిరించాడని చెప్పారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
Hair winter : వింటర్ లో ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాల్సిందే.. మిస్ అయితే చాలా నష్టపోతారు!

ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదన్నారు.అసలు అప్పు సమస్య నుంచి బయట పడతానా? అనే ప్రశ్న తలెత్తేదన్నారు.అలాంటి సమయంలో ఎలాగైనా అప్పుడు తీర్చాలని భావించినట్లు చెప్పాడు.

Advertisement

నెమ్మదిగా అప్పులు తీరుస్తూ వచ్చినట్లు చెప్పాడు.దూరదర్శన్ కు చెల్లించాల్సిన అప్పుకు బదులుగా పలు యాడ్స్ లో నటించినట్లు చెప్పాడు.

మరుసటి ఏడాది.అంటే 2000 సంవత్సరం తనకు బాగా కలిసి వచ్చిందని చెప్పాడు అమితాబ్.తాను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కనిపించిందన్నారు.

తన ఇంటి వెనుక ఉండే యష్ చోప్రా దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు.తను ఏదైనా పని చూపించాలన్నాడు.

ఆయన మొహబ్బతేన్‌ సినిమాలో అవకాశం ఇచ్చాడు.ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మళ్లీ వెనక్కితిరిగి చూసుకోలేదన్నాడు.

ఆ తర్వాత కౌన్‌ బనేగా కరోడ్‌ పతి బాగా పాపులారిటీ సాధించడంతో తన దశ తిరిగిందన్నారు.తన అప్పులు తీర్చేసినట్లు చెప్పాడు.

తాజా వార్తలు