Minister Botsa Satyanarayana : చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కొత్తేముంది..?: మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స( Minister Botsa Satyanarayana ) స్పందించారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కొత్త ఏముందని విమర్శించారు.

ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబుకి అలావాటేనని ఎద్దేవా చేశారు.చంద్రబాబు ఎవరితో కలిస్తే ఏంటి? కలవకపోతే ఏంటి? అని ప్రశ్నించారు.ప్రజలకు మంచి చేశామన్న ఆయన ప్రజలు తమ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

Minister Botsa Satyanarayana : చంద్రబాబు ఢిల్లీ �

వచ్చే ఎన్నికల్లో వైసీపీ( YCP ) మళ్లీ గెలుస్తుందని స్పష్టం చేశారు.తమ పార్టీలో కొందరు అసంతృప్తితో ఉంటే చేసేదేమీ లేదని తెలిపారు.తాము ఎవరినీ వదులుకోవాలని అనుకోవడం లేదన్నారు.

టికెట్ రాని వారికి అవకాశాలు ఉంటాయని చెప్పారు.ముప్పు ఉంటేనే భద్రత కల్పిస్తారన్న మంత్రి బొత్స షర్మిలకు భద్రత విషయాన్ని అధికారులు చూసుకుంటారని వెల్లడించారు.

Advertisement
Minister Botsa Satyanarayana : చంద్రబాబు ఢిల్లీ �
విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?

తాజా వార్తలు