అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య ( Naga Chaitanya ) ఒకరు.
అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కెరీర్ ను ముందుకు సాగిస్తున్న చైతూకు ఈ మధ్య మళ్ళీ వరుస ప్లాపులు పలకరిస్తున్నాయి.
మజిలీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ పడలేదు.బంగార్రాజు హిట్ అయినా అంతగా కలెక్షన్స్ రాబట్టలేక పోయింది.
తాజాగా వచ్చిన కస్టడీ( Custody ) కూడా చైతును ప్లాప్స్ నుండి బయట పడేయలేక పోయింది.నాగ చైతన్య వరుస ప్లాప్స్ తర్వాత ఇప్పుడు తన కెరీర్ లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాల హిట్స్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
NC23 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి మరోసారి నటిస్తుంది.ఇప్పటికే ఈ జంట లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.దీంతో ఈ హిట్ పెయిర్ మరోసారి జోడీ కట్టనుంది.
ఇదిలా ఉండగా మొన్న చైతూ పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు.
ఈ సినిమాకు తండేల్( Tandel ) అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.ఈ టైటిల్ విన్నప్పటి నుండి అంత ఈ టైటిల్ అంటే అర్ధం ఏంటా అని తెగ ఆరా తీస్తున్నారు.మరి తండేల్ అంటే అర్ధం ఏంటంటే నాయకుడు, కెప్టెన్ అట.ఎలాంటి భయం, బెరుకు లేనివాడు అని అలాంటి యోధుడినే తండేల్ అంటరాని తెలుస్తుంది.టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంపై ఆడియెన్స్ అంచనాలు పెట్టుకున్నారు.
తండేల్ అంటే శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్ధం.మరి తండేల్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy