ఏపీలో వైసీపీ రాజకాయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.నిత్యం ఏదో అంశం పార్టీలో చెలరేగుతూనే ఉంది.
అధికార పార్టీ వైసీపీలో కొందరి పేర్లు తరచూ మీడియాల్లో వినిపిస్తుంటుంది.మొన్నటి దాక కొడాలి నాని పేరు క్యాసినో వివాదంతో మారుమోగింది.
బాబుపై తరచూ విరుచుకుపడే అయన గురించి , ఆయన మాట్లాడే తీరు గురించి అందరికి తెలిసిందే.అలాగే పవన్ కళ్యాణ్ తాజా సినిమా భీమ్లానాయక్ రిలీజ్ రోజు కూడా మంత్రి నాని తీవ్ర విమర్శలు చేశారు.
సినిమాను తొక్కేయడం ఏంటీ ? దీనిని రాజకీయాలకు వాడుకుంటున్నారని, సినిమా టికెట్ ధరలపై చంద్రబాబు, లోకేష్ స్పందించడం ఏంటీ అని విమర్శించారు.దీంతో ఆయన పేరు కూడా మీడియాలో చక్కర్లు కొట్టింది.
అయితే ఇలాంటి నానీలు వైసీపీలో చాలామంది ఉన్నారు.ప్రధానంగా మంత్రుల్లోనే ముగ్గురు ఉన్నారు.
కొడాలి నాని, పేర్ని నాని, ఆల్లనాని అందరికి సుపరిచితులే.వీరిలో వీరిలోనూ కొడాలి నాని పేర్ని నానిల పేర్లు తరచుగా మీడియాలో వినిపిస్తోంది.
దీనికి ఓ కారనం ఉంది.వివాదాలు ఎక్కడుంటే వారు అక్కడే ఉంటారు కాబట్టి.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం జగన్ సీఎం ఖావడం, తన కేబినెట్ గురించి మాట్లాడడం జరిగింది.రెండున్నరేండ్ల తరువాత 90శాతం వరకు మంత్రి వర్గంను సంపూర్ణంగా మారుస్తానని ప్రకటించారు.
ఇప్పటికే రెండున్నరేండ్లు గడిచాయి.కరోనాతో కేబినెట్ విస్తరణ వాయిదా పడింది.
ప్రస్తుతం ఉగాది నాటికి మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.ఇదే సమయంలో జిల్లాల ఏర్పాటు కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అంటే ఈ ప్రక్రియ పూర్తి కాగానే మంత్రి వర్గంపై సీఎం జగన్ దృష్టి పెడతారని సమాచారం.
అంటే పాత 13జిల్లాలు త్వరలోనే 26 కానున్నాయి.ఆయా జిల్లాల నుంచి 26మందిని మినిస్టర్లుగా తీసుకునే వీలుంది.ఈక్రమంలోనే కొడాలి నాని, పేర్ని నాని కలవరానికి గురవుతున్నట్టు తెలిసింది.
ఎందుకంటే కృష్ణ జిల్లాను రెండుగా చీల్చడంతో కృష్ణ జిల్లా కాస్త ఎన్టీఆర్ జిల్లాతో రెండు జిల్లాలుగా ఏర్పాటు కానుంది.కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ కృష్ణ జిల్లా పరిధిలోనే ఉన్నారు.
ఒకరు గుడివాడ, మరొకరు మచిలీపట్నం ఎమ్మెల్యేలుగా , మంత్రులుగా ఉన్నారు.మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరికి ఛాన్సు వస్తుందని చర్చ సాగుతోంది.
సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు కొడాలి నాని.చంద్రబాబు, లోకేష్‌ను కొడాలి తిట్టినంత మరెవరూ తిట్టలేదు.
పేర్ని నాని కూడా జగన్‌కు ఇష్టమైన వాడే.ఏవిషయంలో నైనా చలోక్తులతో మాట్లాడడం పేర్నికే చెందుతుంది.
సినిమా టికెట్ల విషయం ఇందుకు నిదర్శనం.
అయితే సీఎం జగన్ మాత్రం ఒక జిల్లా నుంచి ఒక్కరికే ప్రాధాన్యం ఇస్తే పరిస్థితేంటి అన్న సందేహం కలుగక మానదు.
కొడాలి నానీ, పేర్ని నానీల్లో ఎవరి వైపు జగన్ మగ్గురవుతారోనననేది ఆసక్తికర అంశం.ఇద్దరిని కాదని కొత్తవారికి అవకాశం ఇవ్వాలను కుంటే చాలామంది ఆశావహులు ఉన్నారు.
బీసీ సామాజిక వర్గం నుంచైతే జోగి రమేష్ పేరు వినిపిస్తోంది.ఈయనకు మినిస్టర్ పదవి కట్టబెడితే ప్రస్తుత ఇద్దరి నానీల పరిస్థితి ఏంటీ ? వారు ఇక ఇంటి ముఖం పట్టాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.ఇది నిజమవుతుందా ? లేక ఇంకేమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా ? అనేది మంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు వేచి చూడాల్సిందే.