కరోనాతో కేబినెట్ విస్తరణ వాయిదా పడింది.ప్రస్తుతం ఉగాది నాటికి మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
ఇదే సమయంలో జిల్లాల ఏర్పాటు కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.అంటే ఈ ప్రక్రియ పూర్తి కాగానే మంత్రి వర్గంపై సీఎం జగన్ దృష్టి పెడతారని సమాచారం.
"""/" /
అంటే పాత 13జిల్లాలు త్వరలోనే 26 కానున్నాయి.ఆయా జిల్లాల నుంచి 26మందిని మినిస్టర్లుగా తీసుకునే వీలుంది.
ఈక్రమంలోనే కొడాలి నాని, పేర్ని నాని కలవరానికి గురవుతున్నట్టు తెలిసింది.ఎందుకంటే కృష్ణ జిల్లాను రెండుగా చీల్చడంతో కృష్ణ జిల్లా కాస్త ఎన్టీఆర్ జిల్లాతో రెండు జిల్లాలుగా ఏర్పాటు కానుంది.
కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ కృష్ణ జిల్లా పరిధిలోనే ఉన్నారు.ఒకరు గుడివాడ, మరొకరు మచిలీపట్నం ఎమ్మెల్యేలుగా , మంత్రులుగా ఉన్నారు.
మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరికి ఛాన్సు వస్తుందని చర్చ సాగుతోంది.