అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడితే ఏమి జరుగుతుంది..??

అమెరికా రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కి పోతున్నాయి.బహుశా అమెరికా చరిత్రలో ఈ తరహా రాజకీయ అలజడి జరిగిఉండదు కాబోలు అన్నట్టుగా ఉంది తాజా పరిస్థితి.

ఎక్కడ చూసినా.ఏ దేశంలో అయినా అమెరికా రాజకీయాలపై చర్చే జోరుగా సాగుతోంది.

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ట్రంప్ కి గట్టి పోటీని ఇవ్వనునడంటతో ఈ సారి విజయావకాశాలపై తీవ్ర ఉత్కంట రేగుతోంది.ఇదిలాఉంటే రెండు రోజుల క్రిత్రం ట్రంప్ అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం విధితమే.

అయితే సొంత పార్టీ నేతలు సైతం ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించని నేపధ్యంలో మళ్ళీ ట్రంప్ ఎన్నికలు యధావిధిగా జరిగితే మంచిదని ప్రకటించారు.అయితే అసలు అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడితే ఎవరికి లాభం.

Advertisement
What Happens If US Elections Postponed, US Elections Postponement, US, Democrati

ఎవరికి నష్టం.అసలు ఏమి జరుగుతుంది.?? ఈ వివరాలలోకి వెళ్తే.అమెరికాలో నాలుగేళ్లకి ఒకసారి నవంబర్ నెలలో మొదటి వారంలో వచ్చే ఎన్నికలు యాదావిదిగా జరగాలని అమెరికా చట్టంలో ఉంది.

ఒకవేళ ఈ ఎన్నికలు వాయిదా పడాలంటే అందుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి.

What Happens If Us Elections Postponed, Us Elections Postponement, Us, Democrati

కాంగ్రెస్ సెనేట్ లో రిపబ్లికన్ పార్టీకి పట్టు ఎక్కువగా ఉంటే..హౌజ్ ఆఫ్ కామర్స్ లో డెమొక్రాట్స్ కి పట్టు ఉంటుంది.

ఒకవేళ ఇద్దరికీ ఎన్నికలు రద్దు ఆమోదయోగ్యమైనా అధ్యక్షుడిగా కొనసాగే హక్కు ట్రంప్ కి లేదు.ఎందుకంటె జనవరి 20 లోగా అమెరికా చట్టాల ప్రకారం కొత్త అధ్యక్షుడికి పగ్గాలు అప్పగించాల్సిందే.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
తల మీద 735 గుడ్లు పెట్టుకుని వరల్డ్ రికార్డ్ కొట్టాడు.. వీడియో చూస్తే షాక్!

అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేస్తే ప్రతినిధుల సభ నిర్వహించడానికి అర్హతలు ఉండవు.ఆ సమయంలో సెనేట్ అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.

Advertisement

సెనేట్ ఈ ఎంపిక చేయకపోతే స్పీకర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.అయితే ఇవన్నీ తెలియకనే ట్రంప్ అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలని పట్టుబట్టి తరువాత నాలిక కరుచుకున్నారని అంటున్నారు పరిశీలకులు.

తాజా వార్తలు