కేసీఆర్ ఫ్యామిలీ లో ' కవిత ' గొడవేంటి ? 

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం లో ఏం జరుగుతోంది అనే ఆసక్తి, చర్చ తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉంది .

ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత , కుమారుడు కేటీఆర్ కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని , అందుకే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు అని , ఎన్నో రకాలుగా ప్రచారాలు నడిచాయి.

దీనికి తగ్గట్లుగానే నిజామాబాద్ ఎంపీ గా ఓటమి చెందిన తర్వాత కవిత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.టిఆర్ఎస్ కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనకుండా మౌనంగానే ఉంటూ వస్తున్నారు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి ఆమె పోటీ చేసి విజయం సాధించారు .పదవి వచ్చినా సైలెంట్ గా ఉన్నారు తప్ప , మొదట్లో ఉన్నంత యాక్టివ్గా అయితే ఆమె కనిపించకపోవడంతో,  ఏదో జరుగుతోందని భావన అందరిలోనూ కలిగింది.ఇక ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువదింది.

వాటిని భర్తీ చేసే పనుల్లో కేసీఆర్ బిజీగా ఉన్నారు .అయితే మళ్లీ ఎమ్మెల్సీ స్థానాన్ని కవిత ఆశిస్తూ ఉండగా,  కెసిఆర్ మాత్రం ఆమెను రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయిపోయారు.  ఈ మేరకు ప్రకటన కూడా చేశారు.

Advertisement

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరును ఫైనల్ చేశారు కానీ,  నిన్న ఆకస్మాత్తుగా కవిత నిజామాబాద్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తారని ప్రకటన వెలువడింది.దీంతో ఏం జరిగిందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్ర మంత్రులను కలిసేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు.  అలాగే ఆయన సతీమణి అనారోగ్యం దృష్ట్యా కేసీఆర్ కుటుంబం అక్కడే ఉంది .ఈ సందర్భంగా కేటీఆర్ కవిత కూడా ఢిల్లీలోనే ఉండడంతో వారి మధ్య ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి సంబంధించిన చర్చ జరగడం రాజ్యసభ సభ్యురాలుగా ముందుగా కవితను  ఎంపిక చేసి అనంతరం ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించుకోవడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.

మొదట్లో టిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన కవిత రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చూశారు.  కానీ ఆమెను ఎంపీ గా గెలిపించారు.  ఆ తర్వాత మళ్లీ ఎంపీగానే పోటీ చేసి ఓటమి చెందారు.

ఆ తర్వాత స్థానిక సంస్థల కోటా నుంచి ఆమెకు ఎమ్మెల్సీ స్థానం దక్కినా మంత్రి పదవి మాత్రం ఆమెకు దక్కలేదు.ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో,  గెలిచిన తర్వాత కవితకు మంత్రి పదవి అప్పగిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

  రాఖీ పండుగ సమయంలో కవిత అమెరికాలో ఉన్నారు.  ఆ సందర్భంగా ఆమె కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పినా, కవిత కు కేటీఆర్ రిప్లై ఇవ్వకపోవడంతో వారి మధ్య విబేధాలు తీవ్రంగా ఉన్నాయి అనే విషయం అందరికీ అర్థం అయ్యింది.

Advertisement

తాజా వార్తలు