విటమిన్ A లోపిస్తే కళ్ళే కాదు అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి.. తెలుసా?

మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ A ( Vitamin A )ఒకటి.

చాలా మంది విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు.

విటమిన్ ఎ లోపిస్తే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయని, కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతాయని, కంటి చూపు త‌గ్గుతుంద‌ని భావిస్తారు.కానీ కళ్ళే కాదు విటమిన్ ఎ లోపం వల్ల మరెన్నో ఎఫెక్ట్ అవుతాయి.

ముఖ్యంగా విటమిన్ ఎ లోపం వల్ల ఇమ్యూనిటీ సిస్టం దెబ్బ తింటుంది.సంతాన సమస్యలు( Parental problems ) తలెత్తుతాయి.

పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా ఉండదు.అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి.

Advertisement

ముఖ్యంగా చ‌ర్మం పొడిబార‌డం, నిర్జీవంగా త‌యార‌వ‌డం వంటివి ఇబ్బంది పెడ‌తాయి.అందుకే విటమిన్ ఎ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

మరి ఇంతకీ విటమిన్ ఎ మెండుగా ఉండే ఆహారాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

చిలగ‌డదుంప.విటమిన్ ఎ కు పవర్ హౌస్ లాంటిది.రోజుకు ఒక ఉడికించిన చిలగ‌డదుంపను( Sweet potato ) తీసుకుంటే విటమిన్ ఎ తో పాటు మీ శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు లభిస్తాయి.

ఫైబ‌ర్ సైతం చిల‌గ‌డ‌దుంపులో పుష్క‌లంగా ఉంటుంది.అలాగే గుడ్డులో( egg ) విటమిన్ ఎ రిచ్ గా ఉంటుంది.అందుకే ప్రతి రోజూ ఉదయం ఒక ఉడికించిన గుడ్డు తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

విటమిన్ ఎ కు గొప్ప మూలం క్యాప్సికం.అందులోనూ రెడ్ క్యాప్సికం( Red capsicum ) లో విటమిన్ ఎ చాలా అధికంగా ఉంటుంది.కాబ‌ట్టి, వారానికి రెండు సార్లు అయినా రెడ్ క్యాప్సికం ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

Advertisement

విటమిన్ ఎ లోపానికి దూరంగా ఉండాలి అనుకుంటే రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తీసుకోండి.ఇక ఇవే కాకుండా పాలు, బొప్పాయి పండు, ఆకు కూరలు, పెరుగు, చేపలు వంటి ఆహారాల్లోనూ సైతం విటమిన్ ఎ పుష్కలంగా నిండి ఉంటుంది.

కాబట్టి ఈ ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి.విటమిన్ ఎ లోపాన్ని దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేయండి.

తాజా వార్తలు