Skin Whitening Remedies : మీ ముఖ చర్మం రోజురోజుకు నల్లగా మారుతుందా.. కారణాలేంటి? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి?

సాధారణంగా ఒక్కో సమయంలో కొందరి ముఖ చర్మం నల్లగా( Skin Darkening ) మారుతుంటుంది.అయితే స్కిన్ డార్క్ గా మారడానికి కారణాలేంటో పెద్దగా పట్టించుకోరు.

చర్మాన్ని మళ్లీ మునుపటిలా తెల్లగా మెరిపించుకునేందుకే ప్రయత్నిస్తుంటారు.నిజానికి చర్మం రోజురోజుకు నల్లగా మారుతుంది అంటే కారణాలు చాలానే ఉన్నాయి.

వేడి వేడి నీటితో స్నానం చేయడం, ఎండలో అధికంగా తిరగడం, రసాయనాలు అధికంగా ఉండే సబ్బులు వాడటం, ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, డైరీ ప్రొడక్ట్స్ ను ఓవర్ గా తీసుకోవడం, కెమికల్స్ తో కూడిన కాస్మోటిక్స్ ను వినియోగించడం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల చర్మంలో మెలనిన్( Melanin ) ఉత్పత్తి పెరుగుతుంది.ఫలితంగా స్కిన్ డార్క్ గా మారుతుంది.

మీ చర్మం నల్లగా మారుతుంది అంటే ఇప్పుడు చెప్పుకున్న విషయాల్లో ప్రత్యేక జాగ్ర‌త్త‌ తీసుకోవాలి.అలాగే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Advertisement
What Are The Causes Of Skin Darkening-Skin Whitening Remedies : మీ ము�

వాటిలో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం.ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బీట్ రూట్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

What Are The Causes Of Skin Darkening

ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు మరియు చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీ చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది.

అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బాదాం పౌడర్,( Badam Powder ) నాలుగు టేబుల్ స్పూన్ల పాలు ( Milk ) వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి.

ఇక తేనె, నిమ్మరసం సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.పది నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

What Are The Causes Of Skin Darkening
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఈ రెండు చిట్కాలు కూడా డార్క్ గా మారిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది.స్కిన్ ను వైట్ గా బ్రైట్ గా మారుస్తాయి.ఇక ఈ చిట్కాలతో పాటు ఆరోగ్యమైన‌ జీవన శైలిని అలవాటు చేసుకోవాలి.

Advertisement

డైట్ లో ఆకుకూరలు, కూర కాయలు, తాజా పండ్లు వంటి వాటిని చేర్చుకోవాలి.పాస్ట్‌ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలను అవాయిడ్ చేయాలి.

కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.ఇక వ్యాయామం వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉంటుంది.

తాజా వార్తలు