ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాంగ్రెస్ కు బుద్ధి చెబుతాం.. కేటీఆర్

కాంగ్రెస్ కు మంత్రి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు.అచ్చంపేట ఘటనలో గాయపడిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పరామర్శించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ఓటమి ఫ్రస్టేషన్ తో దాడులకు పాల్పడుతుందని కేటీఆర్ ఆరోపించారు.రేపు ఇదే పరిస్థితి వాళ్లకు కూడా రావచ్చన్నారు.

రౌడీ మూకలు కాంగ్రెస్ అండతో రెచ్చిపోతున్నాయన్న కేటీఆర్ ఎమ్మెల్యే బాలరాజుకు భద్రత పెంచాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను హెచ్చరిస్తున్నామన్నారు.

తెలంగాణలో ఇలాంటి దాడుల సంస్కృతిని తీసుకొస్తే వారికే నష్టమని స్పష్టం చేశారు.తెలంగాణలో ఈసారి వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.

Advertisement

ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాంగ్రెస్ కు బుద్ది చెబుతామని వెల్లడించారు.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?
Advertisement

తాజా వార్తలు