ట్రైన్లో అప్పర్ బెర్త్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి!

ఇండియాలో సుదూరాలకు ప్రయాణించేవారు దాదాపుగా రైల్వే మార్గాన్నే ఎంచుకుంటారు.ఈ క్రమంలో ఆసియాలోనే అతి పెద్ద రైల్వే మార్గంగా ఇండియన్ రైల్వేస్ కీర్తి గడించింది.

ఇక ఇక్కడ ప్రయాణికులు చాలామంది ముందుగా తమ జర్నీని ప్లాన్ చేసుకొని బెర్తులు రిజర్వ్ చేసుకుంటారు.ఇపుడు స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులో ఉండడంతో దాదాపుగా అందరూ IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ఆన్‌లైన్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటూ వుంటారు.

ట్రైన్ టికెట్ బుక్ చేసేప్పుడు బెర్త్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది కూడా ఉంటుంది అనే విషయం అందరికీ విదితమే.

Want To Select Upper Berth In Train But Know These Rules, Railways, Platform, Up

ముఖ్యంగా అప్పర్ బెర్త్‌కు సంబంధించి చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి.అయితే అప్పర్ బెర్త్ కి సంబంధించి చాలామంది ఎలాంటి నియమనిబంధనలు ఉండవని అనుకుంటారు, కానీ ఉంటాయి.లోయర్ సీట్‌లో 2 RAC టికెట్స్ కూర్చుంటే, అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు ఎక్కడ కూర్చోవాలి? అన్న సందేహం రాక మానదు.అయితే లోయర్ బెర్త్‌లల్లో దాదాపుగా ఆరుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు.

Advertisement
Want To Select Upper Berth In Train But Know These Rules, Railways, Platform, Up

కాబట్టి మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు లోయర్ బెర్త్‌లో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది.అయితే దీనికి సమయం అనేది ఉంటుంది.

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూర్చోవచ్చు.

Want To Select Upper Berth In Train But Know These Rules, Railways, Platform, Up

అయితే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రపోయే సమయం కాబట్టి ఎవరి బెర్త్‌లో వారు ఖచ్చితంగా నిద్రపోవాలి.ఇక సైడ్ లోయర్ బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు RAC టికెట్స్ ద్వారా కేటాయిస్తే, సైడ్ అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు ఎక్కడ కూర్చోవాలి అన్న డౌట్ కూడా చాలామందికి వస్తుంది.ఇక్కడ కూడా సేమ్ రూల్స్ అనేవి వర్తిస్తాయి.

పగలు సైడ్ అప్పర్ బెర్త్‌లో ఉన్న ప్రయాణికుడు కింద కూర్చోవచ్చు.ఒకవేళ సైడ్ లోయర్ బెర్త్‌ను ఇద్దరు RAC ప్రయాణికులకు కేటాయిస్తే, వారి అనుమతితో సైడ్ అప్పర్ బెర్త్‌లోని ప్రయాణికుడు కింది బెర్త్‌లో కూర్చోవచ్చు.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
తగ్గేదెలా.. వెస్టిండీస్ బౌలర్ పై కాలు దువ్విన యువరాజ్ సింగ్

లేకపోతే అప్పర్ బెర్త్‌లోనే అడ్జెస్ట్ కావాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు