యంగ్ హీరో నాని ని హీరోయిన్ కీర్తి సురేష్ ఓడించింది.వీరిద్దరు కలిసి గతంలో నేను లోకల్ సినిమా లో నటించిన విషయం తెల్సిందే.
తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి దసరా సినిమా లో నటించారు.వచ్చే నెలలో విడుదల కాబోతున్న దసరా సినిమా ప్రమోషన్ ఒక వైపు నేడు నాని పుట్టిన రోజు అవ్వడంతో మరో వైపు అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ను ప్రమోట్ చేస్తూ నాని కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నాని బర్త్ డే సందర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఆ వీడియో లో నాని మరియు కీర్తి సురేష్ లు సరదాగా బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు.
ఆ ఆటలో నాని ఓడి పోయాడు.బ్యాడ్మింటన్ లో నాని ని కీర్తి సురేష్ ఓండించింది.
తాను గెలిచాను అంటూ సరదాగా కీర్తి సురేష్ వీడియో లో సందడి చేయడం మనం చూడవచ్చు.ఇక కీర్తి సురేష్ అదే సమయంలో నానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
![Telugu Dasara, Nani, Keerthy Suresh, Nanikeerthy, Nani Dasara, Telugu-Movie Telugu Dasara, Nani, Keerthy Suresh, Nanikeerthy, Nani Dasara, Telugu-Movie]( https://telugustop.com/wp-content/uploads/2023/02/hero-nani-and-keerthy-suresh-badminton-in-dasara-setsa.jpg)
స్వీట్ శుభాకాంక్షలు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అన్ని వర్గాల వారిని అలరించే విధంగా వీరిద్దరు కలిసి నటించిన దసరా సినిమా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.నాని మరియు కీర్తి సురేష్ లు గతంలో నటించగా హిట్ అయిన సెంటిమెంట్ ఉంది కనుక ఈ దసరా సినిమా కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.రికార్డు స్థాయి వసూళ్ల ను ఈ సినిమా రాబడుతుంది అంటూ కూడా నాని బలంగా వాదిస్తున్నాడు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది.గత ఏడాది వచ్చిన కేజీఎఫ్ 2.
ఆర్ఆర్ఆర్ మరియు కాంతార సినిమా ల గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో అలాగే ఈ సినిమా గురించి కూడా మాట్లాడుకోబోతున్నట్లుగా నాని చెబుతున్నాడు.అంతటి నమ్మకం ను నాని వ్యక్తం చేస్తున్నాడు.
మరి దసరా సినిమా ఆ స్థాయి లో ఉంటుందా అనేది చూడాలి.మా తరపున మీ తరపున నాచురల్ స్టార్ నానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.