యంగ్ హీరో రానా విరాటపర్వం సినిమా తర్వాత ఇప్పటి వరకు తదుపరి సినిమా విషయంలో క్లారిటీ రావడం లేదు.కానీ గత ఏడాది విడుదల అవ్వాల్సిన రానా నాయుడు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.
వచ్చే నెలలో రానా నాయుడు స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడ్డ రానా నాయుడు స్ట్రీమింగ్ డేట్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రానా నాయుడు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఈ వెబ్ సిరీస్ లో రానా తో పాటు వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఒక మంచి పాత్ర లో రానా మరియు వెంకటేష్ లు కలిసి కనిపించబోతున్నారు అనే ఆసక్తికర అప్‌డేట్స్ అయితే వస్తున్నాయి.ఇదే సమయంలో రానా తదుపరి సినిమా విషయమై కూడా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

రానా నాయుడు వెబ్ సిరీస్ తర్వాత కొత్త సినిమాకు రానా ఓకే చెప్పే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కొన్ని కథలను విన్నాడని కూడా సమాచారం అందుతోంది.కొన్ని కథలకు ఓకే చెప్పిన రానా తనను తాను విభిన్నంగా చూపించాలని భావిస్తున్నాడట.అందుకోసం విభిన్నమైన కథలను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వెబ్ సిరీస్ కు వచ్చిన స్పందన అనుసారంగా.తన పాత్రకు వచ్చిన స్పందన అనుసారంగా తన తదుపరి సినిమా ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా తన సినిమా లు ఉండాలని రానా ఆశ పడుతున్నాడు.అందుకే కాస్త స్లో గా అయినా కూడా మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
రానా నాయుడు సినిమా వెబ్ సిరీస్ ను వచ్చే నెలలో స్ట్రీమింగ్ చేయబోతున్న విషయం తెల్సిందే.







