నందమూరి తారక రామారావు తన యొక్క సినీ స్టార్ డమ్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.తెలుగు వారు ప్రపంచం లో ఎక్కడ ఉన్నా కూడా నందమూరి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే అది కేవలం ఆయన వల్లే అనడంలో సందేహం లేదు.
తన ఫ్యామిలీని అత్యున్నత స్థాయిలో నిలిపిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్.ఒక యోధుడిగా ఆయన సినిమా ల్లో రాణించాడు.రాజకీయాలు చేశాడు.ఎంతో గొప్ప స్థానంలో తన కుటుంబ సభ్యులను నిలిపాడు అనడంలో సందేహం లేదు.ఆయన యొక్క వారసత్వంను పునికి పుచ్చుకుని బాలకృష్ణ మరియు హరికృష్ణ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.బాలయ్య ఇప్పటికి కూడా హీరోగా సాగుతున్నాయి.
వందల కోట్ల ఆస్తులను తన కొడుకులు మరియు కూతుర్లకు ఎన్టీఆర్ ఇచ్చారు.అప్పట్లోనే భారీగా సంపాదించిన ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులు మూడు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని ఇవ్వడం జరిగింది.
అయినా కూడా ఆయన మనవల్లు అయిన జూనియర్ ఎన్టీఆర్ మరియు తారకరత్న లు చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఆర్థికంగా కాస్త ఇబ్బందిని చవి చూసినా కూడా చిన్న తనంలో ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకోక పోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట.హరికృష్ణ రెండవ భార్య కొడుకు అవ్వడం వల్ల ఎన్టీఆర్ ను ఆ ఫ్యామిలీ దూరం పెట్టే ప్రయత్నం చేసింది.కానీ ఆ తర్వాత తర్వాత వారే ఎన్టీఆర్ వద్దకు వచ్చారు.
ఇక తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా కుటుంబం నుండి ఆస్తి దక్కలేదు.ఎంత చెప్పినా వినకుండా తారకరత్న చేసుకున్న ప్రేమ వివాహం ఆయన జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేలా చేసింది.
ఒకానొక సమయంలో కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా మారిందని కొందరు అంటున్నారు.చనిపోవడానికి ముందు తారకరత్న మళ్లీ ఆర్థికంగా బాగానే ఉన్నాడు.
వందల కోట్లు ఆయన ఆస్తిగా ఉందట.మొత్తానికి నందమూరి ఫ్యామిలీకి చెందిన ఆ ఇద్దరు మాత్రం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది.







