తెలుగు సినీ జనాలను ఒకానొక సమయంలో కంటి మీద కునుకు లేకుండా చేసిన శ్రీ రెడ్డి గుర్తు ఉంది కదా.ఆమె గత కొన్నాళ్లుగా తమిళనాడులో ఉంటుంది.
అక్కడ నుండే తన ఆపరేషన్స్ ను తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తూ ఉంటుంది.అన్ని రకాలుగా ఆమె తన యొక్క హడావుడి సోషల్ మీడియాలో చేస్తూ ఉంది.
చెన్నై వెళ్లి పోయిన తర్వాత కూడా శ్రీ రెడ్డి చాలా సార్లు తెలుగు హీరోల మీద మరియు తెలుగు సినిమా పరిశ్రమ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శించిన విషయం తెల్సిందే.ఆమె ను చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫాలో అవుతున్నారు.
చాలా మంది ఆమెను అభిమానిస్తారు.అందుకు కారణం ఆమె సినిమా హీరోలను మరియు రాజకీయ పార్టీ లను తీవ్రంగా విమర్శిస్తూ ఉంటుంది.
అలా పవన్ యాంటీ ఫ్యాన్స్ తో పాటు మరి కొందరు హీరోల యాంటీ ఫ్యాన్స్ కూడా ఆమెకు ఫ్యాన్స్ గా మారారు.ఇప్పుడు వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ రెడ్డి చాలా సైలెంట్ గా ఉండటం ను వారు తట్టుకోలేక పోతున్నారు.

ఇన్నాళ్లు మౌనంగా ఎందుకు ఉంటుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు.అదుగో ఇదుగో అంటూ శ్రీ రెడ్డి యొక్క సైలెన్స్ ను చాలా మంది బ్రేక్ చేయించేందుకు ప్రయత్నించినా కూడా ఆమె మాత్రం ప్రస్తుతానికి తన నోటికి తాళం వేసుకుని ఉందా అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి శ్రీ రెడ్డి యొక్క సైలెన్స్ కు కారణం ఏంటీ.
ముందు ముందు అయినా ఈమె తన నోరు విప్పి గతంలో మాదిరిగా తన వ్యూ ను సోషల్ మీడియా ద్వారా మరియు యూట్యూబ్ ద్వారా అందరికి వినిపిస్తుంది అనేది చూడాలి.







