వైర‌ల్ వీడియోః ఈ పిల్ల‌కోతిని చూస్తే మ‌నం చాలా నేర్పుకోవ‌చ్చు..!

జీవితంలో ఎదగాలంటే ప‌ట్టుద‌ల ఉండాలి.అది ప‌క్షులు, జంతువులైతే ఎగ‌రాలంటే ప‌ట్టుద‌ల ఉండాలి.

సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌తి ఒక్క‌టి వైర‌ల్‌గా మారుతోంది.ఏదైన విభ‌న్నంగా ఉంటే చాలు అది వైర‌ల్ అవుతుంది.

అది మ‌నుషులు చేసినా, పక్షులు, జంతువులు చేసినా వైర‌ల్‌గా మారుతుంది.ప్ర‌స్తుతం ప్రపంచంలో చాలా వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.

కొన్ని వీడియోలు మనసును ఆహ్లాద‌ప‌రుస్తాయి.మరికొన్నిఆశ్ఛ‌ర్యానికి గురి చేస్తాయి.

Advertisement
Viral Video: If You Watch This Baby Monkey, We Can Learn A Lot ..!, Monkey, Indp

ఇంకొన్ని ఆందోళన కలిగిస్తుంటాయి.మ‌రిన్ని వీడియోలు మ‌ధురానుభూతిని మిగులుస్తాయి.

అయితే ఇప్ప‌డు మ‌నం చెప్పుకోబోయేది ఈ పిల్ల కోతి వీడియో గురించిఓ పిల్ల కోతి చేసిన పని అందరినీ ఆశ్ఛ‌ర్యానికి గురిచేస్తోంది.పట్టు ప‌డితే విడ‌వ‌రాదు అన్న చందంగా చేస్తోంది ఈ పిల్ల కోతి.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.ఈ వీడియోలో ఓ పిల్ల కోతి తన తల్లితో ఉంది.

అయితే త‌ల్లి గోడ మీద ఎక్కి కూర్చుంది.దాంతో కోతి పిల్ల గోడపైకి ఎక్కేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఆ గోడ తడిగా ఉండటం వల్ల కోతి పిల్ల జారి కింద‌ప‌డుతోంది.అయినా ప‌ట్టు విడ‌వ‌కుండా ప్రయత్నించడం ఆప‌లేదు.మరోసారి గోడపైకి ఎగ‌ర‌గానే జారి మళ్లీ కిందపడింది.

Advertisement

ఇదంతా పట్టించుకోని తల్లి కోతి గోడ మీద కూర్చుంది.దాంతో పిల్లకోతి దాని తోకను పట్టుకుని గోడపైకి ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.

పిల్ల కోతి ఆ తోక‌ను ప‌ట్టుకొని ఎలాగో అలాగో గోడ పైకి ఎక్కి కూర్చుంటుంది.ప్ర‌య‌త్నిస్తే స‌క్సెస్ అవుతామ‌ని ఈ వీడియో నిరూపించింది.ప‌ట్టుద‌ల ఉంటే ఏదైనా సాధించొచ్చ‌ని ఈ వీడియోను అర్థ‌మ‌వుతుంది.

ఇప్ప‌డు ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.అంద‌రూ ఈ వీడియోను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

తాజా వార్తలు