వైరల్: రెప్పపాటు వ్యవధిలో పిల్లాడిని కాపాడిన వ్యక్తి... సూపర్ మ్యాన్ అంటూ నెటిజన్లు!

వైరల్ వీడియోలకు కేరాఫ్ అడ్రెస్ సోషల్ మీడియా.ఇక్కడ ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటాయి.

 Viral The Person Who Saved The Child In The Blink Of An Eye Netizens Called Him-TeluguStop.com

ఎన్ని వీడియోలు అప్లోడ్ అయినా, కొన్ని మాత్రమే వాటి ప్రత్యేకతను చాటుకుంటాయి.ఇంకా అందులో మరికొన్ని చాలా ప్రత్యేకతని సంతరించుకుంటాయి.

అవును, ఇపుడు అలాంటి కోవకు చెందిన ఒక వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకుంది.నేటి జీవితం నల్లేరు మీద నడకవంటిది.

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు.రెప్పపాటులో ప్రాణాలు కోల్పోతుంటారు.

ముఖ్యంగా రోడ్డుపైన జరిగే ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం అలాంటి ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

సదరు వీడియోని ఒకసారి గమనిస్తే, ఆ రోడ్డుపై ఓ ముగ్గురు నలుగురు పాదచారులు నడుచుకుంటూ వెళ్లడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.ఇంతలో ఓ బైక్‌ హఠాత్తుగా వచ్చి రోడ్డు దాటుతోన్న పిల్లాడిని ఢీ కొట్టబోతుంది.

ఇంతలో అటుగా వెళ్తున్న పాదచారుల్లో ఒకతను రెప్పపాటులో పిల్లాడిని సింగిల్‌ హ్యాండ్‌తో ఎత్తి పక్కకు లాగేస్తాడు.దాంతో పెనుప్రమాదం తప్పింది.

అయితే సడెన్‌ బ్రేక్‌ వేయడంతో ఆ బైక్‌ స్కిడ్‌ అయ్యి దానిపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడిపోవడం వీడియోలో చూడొచ్చు.అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అందరూ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.అంటే ఇక్కడ ఒక్క సెకెనులో దారుణమైన ప్రమాదం అదృష్టం తోడవడంతో నిండు ప్రాణాలు బయటబట్టగలిగాయి.ఇక్కడ ఒక్క సెకను ఆలస్యమైతే కళ్లముందు భయంకరమైన సన్నివేశం చూడాల్సి వచ్చేది.

అయితే ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు పిల్లాడిని కాపాడిన వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube