ఇండియన్ రైల్వే తాజాగా ఓ అదిరిపోయే నిర్ణయం తీసుకుంది.ఇకనుండి రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ATVM (ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్) నుంచి అన్ రిజర్వ్‌డ్ టికెట్ కొనుగోలు చేసేందుకు UPI విధానాన్ని ఫాలో కావచ్చు.
అయితే ఈ విధానం త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.సౌత్ రైల్వే పరిధిలో 6 డివిజన్లలో 254 అప్‌గ్రేడ్ ATVMలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తద్వారా ప్రయాణీకులు UPI లేదా QR కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా టిక్కెట్ ఛార్జీని చెల్లించవచ్చు.

ఇక ఈ సేవలు ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయిలో రానున్నాయి.అంతవరకూ ప్రయాణీకులు తమ స్మార్ట్ కార్డ్‌ల R-వాలెట్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా మాత్రమే టిక్కెట్‌లను కొనుగోలు చేయొచ్చు.చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్, తాంబరంతో సహా అనేక ప్రధాన స్టేషన్లలో టిక్కెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు భారీగా క్యూ కట్టాల్సిన పరిస్థితి ఇకనుండి మారుతుంది.
అవును, డబ్బులు చెల్లించే విషయంలో జరుగుతున్న ఆలస్యానికి ఇక చెక్ పడనుంది.ఈ అప్‌గ్రేడ్ చేసిన ATVM కియోస్క్ స్క్రీన్‌పై ప్రయాణికులు తమ ప్రయాణ మార్గాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత.
ప్రయాణికులు యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.

ఇకపోతే ముఖ్యంగా టికెట్ కౌంటర్లలో రద్దీని తగ్గించే లక్ష్యంతో ఎనిమిదేళ్ల క్రితం రైల్వే శాఖ ATVMలను ప్రవేశపెట్టిన సంగతి విదితమే.చెన్నై డివిజన్‌లో మొత్తం 34 ATVMలు, దక్షిణ రైల్వేలోని మరో 5 డివిజన్లలో 65 ATVMలు పనిచేస్తున్నాయి.అప్‌గ్రేడ్ టికెట్ వెండింగ్ మెషీన్ ద్వారా లోకల్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్ల కోసం అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.
సీజన్ టిక్కెట్ హోల్డర్లు నెలవారీ, త్రైమాసిక పాస్‌లను పునరుద్ధరించుకోవచ్చు.స్మార్ట్ కార్డ్ వినియోగం ప్రయాణీకులకు లాభదాయకంగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.







