వైరల్: పంచర్ మ్యాన్ క్రియేటివిటీ మాములుగా లేదుగా.. పాత టైర్లతో ఏకంగా..?!

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అనేది తప్పకుండా ఉండే ఉంటుంది.ఒక్కోసారి వాళ్ళ క్రియేటివిటీ చూసి వారెవ్వా అని అనాలనిపిస్తుంది.

అయితే కొందరు శిక్షణ తీసుకుని నేర్చుకుంటే మరి కొందరు మాత్రం ఎటువంటి శిక్షణ తీసుకోకుండా తమంతట తామే కళాకృతులను నిర్మించి అద్భుతాలను సృష్టిస్తారు.ఒక పంచర్ షాప్ దుకాణదారుడు కూడా సరిగ్గా ఇదే కోవలోకి వస్తాడు.

అతని క్రియేటివిటి చూసి అందరు నోరు వెళ్ళబెడుతున్నారు. పాడైపోయిన టైర్లును ఉపయోగించి రోడ్డుకు ఇరువైపులా డైనోసర్లు, డ్రాగన్లు, తాబేళ్లు, బైక్ల వంటి కళాకృతులను నిర్మించాడు.

అవి చూడడానికి చాలా అందంగా, ఆకర్షణియంగా ఉండడంతో రోడ్డు మీద వెళ్లిపోయేవారు కాసేపు ఆగి వాటితో సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు.అసలు వివరాల్లోకి వెళితే.

Advertisement
Viral Puncher Man Creativity Is Not Normal , Viral Latest, News Viral, Social

మహరాష్ట్రలోని వర్ధాకు చెందిన దాబిర్ షేక్ అనే వ్యక్తి పంక్చర్లు వేస్తూనే తనలోని కళను అందరికి పరిచయం చేస్తున్నాడు.పాత టైర్లతో వివిధ కళాకృతులను తయారు చేసాడు.

అతని దుకాణంలో పాడయిపోయిన టైర్లను చెత్త కుప్పలో పడేస్తుంటారు.అలా వాటిలో వర్షం నీరు చేరి దోమలు చేరుతున్నాయి.

అలా అని వాటిని కాల్చితే కాలుష్యానికి కారణమవుతాయి.అందుకే దాబిర్ షేక్ఒక వినూత్న ఆలోచన చేసి ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించాలనుకున్నారు.

Viral Puncher Man Creativity Is Not Normal , Viral Latest, News Viral, Social

తన దగ్గర ఉన్న పాత టైర్లను ఉపయోగించి డ్రాగన్స్, తాబేళ్లు, బైకులు, పూల కుండీలతో పాటుగా వివిధ ఆకృతులను తయారు చేసినట్లు చెప్పారు.నేను ఎక్కడా వీటిని తయారుచేయడం చూసి నేర్చుకోలేదని చెప్పారు.అలాగే నేను తయారుచేసిన ఈ కళాకృతులను చూసి చుట్టుపక్కల ప్రజలు నన్ను బాగా అభినందిస్తున్నారు అని చెప్పుకోచ్చాడు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..

అలాగే తయారుచేసిన వాటిలో కొన్నింటిని ప్రజలు తీసుకెళ్తున్నారని అంతేకాకుండా చాలా బాగా చేస్తున్నారని నాతో చెప్పడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకోచ్చాడు దాబిర్ షేక్.

Advertisement

తాజా వార్తలు